రైతు వేదిక భవనాలను, ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-06T09:55:43+05:30 IST

రైతుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ అన్నారు...

రైతు వేదిక భవనాలను, ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌


పెద్దకొత్తపల్లి, సెప్టెంబరు 5: రైతుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని వెన్నచెర్ల, పెద్దకార్పముల, చిన్నకొత్తపల్లి గ్రామల్లో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను, ప్రకృతి వనాల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతువేదికలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతాయని, మండలంలో ఏడు వ్యవసాయ క్లస్టర్లలో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు రైతు వేదిక ద్వారానే వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు అందుతాయన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు సెప్టెంబరు 30లోపల పూర్తి చేసేవిధంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌, సర్పంచ్‌లు రాధా, శ్రీనివాస్‌రెడ్డి, పెద్దకొత్తపల్లి సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ బాలస్వామి, ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-06T09:55:43+05:30 IST