రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-12T03:32:40+05:30 IST

ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మాటల గారడి తో ప్రజలను రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని రాష్ట్ర బీజేపీ నాయకులు రాములు, గిరమోని శ్రీనివాస్‌, కమతం రాజేందర్‌రెడ్డి అన్నా రు.

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

గండీడ్‌, డిసెంబరు11: ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మాటల గారడి తో ప్రజలను రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని రాష్ట్ర బీజేపీ నాయకులు రాములు, గిరమోని శ్రీనివాస్‌, కమతం రాజేందర్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు గండీడ్‌ తహసీల్దార్‌ కార్యా లయం ముందు ధర్నా చేపట్టి అనంతరం తహసీ ల్దార్‌ జ్యోతికి వినతిపత్రం అందించారు. మాట్లాడు తూ రైతులను సన్న వడ్లు వేసుకోవాలని చెప్పి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతోపాటు వాటిని కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిం చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శం కర్‌నాయక్‌, రవికాంత్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, ఎన్‌.లక్ష్మయ్య, కుర్వకృష్ణ, శ్రీను, కుర్వమైబు, రాము లు, భీమయ్య, వెంకటయ్య పాల్గొన్నారు. 

హామీలు అమలు చేయాలి 


నవాబ్‌పేట: గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల ని కోరుతూ శుక్రవారం భారతీయ కిసాన్‌ మోర్చా  మండల బీజేపీ అధ్యక్షుడు గవిండ్ల రాజు ఆధ్వర్యం లో తహసీల్దార్‌కు విన్నతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో గవిండ్ల రాజు, రాంరెడ్డి, మల్లికార్జున్‌, భీమన్న, పురుషోత్తం, రామక్రిష్ణ, ఆంజనేయులు, గోపాలగౌడ్‌, కమలాకర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T03:32:40+05:30 IST