‘ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారు’

ABN , First Publish Date - 2020-12-16T03:15:51+05:30 IST

యువత భవిష్యత్‌తో ఆడు కుంటున్న కేసీఆర్‌కు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వ స్తారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

‘ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారు’

వనపర్తి టౌన్‌, డిసెంబరు15: యువత భవిష్యత్‌తో ఆడు కుంటున్న కేసీఆర్‌కు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వ స్తారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ లకు, నిరుద్యోగులకు మొదట క్షమాపణ చెప్పిన తరువాతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి హయాంలో భర్తీచేసిన కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. కేసీ ఆర్‌ ఆటలు కట్టడించడానికే త్వరలో టీపీసీసీ నూతన అధ్య క్షుడు రాబోతున్నాడని హెచ్చరించారు

Read more