మరో 13 మంది

ABN , First Publish Date - 2020-04-08T10:21:31+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జోగు ళాంబ గద్వాల జిల్లాల్లో మంగళవారం 13 కేసులు నమోదు కాగా అందులో ఒకరు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం పది కేసు లు నమోదుకాగా అందులో ఒకరు

మరో 13 మంది

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నమోదైన కేసులివి 

హైదరాబాద్‌లో ఒకరు మృతి

తండ్రి నుంచి 23 రోజుల బిడ్డకు సోకిన వైరస్‌

అందరూ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే..

వారి కాంటాక్టులోని వారికీ ఉన్నట్టు గుర్తింపు


 గద్వాల/మహబూబ్‌నగర్‌ వైద్య విభాగం/నాగర్‌కర్నూలు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జోగు ళాంబ గద్వాల జిల్లాల్లో మంగళవారం 13 కేసులు నమోదు కాగా అందులో ఒకరు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం పది కేసు లు నమోదుకాగా అందులో ఒకరు మృతి చెందారని జిల్లా అధికారులు ప్రక టించారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, రోజోలీ మండల కేంద్రంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వచ్చిందన్నారు. 55 సంవత్సరాల వ్యక్తి హైదరాబాద్‌లో కరోనాతో మంగళవారం మృతి చెందిన ట్లు అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే వడ్డేపల్లి మండల కేంద్రంలోని జమ్మలముడుగు కాలనీలో కరోనా తొలి మరణంగా నమోదైంది. జిల్లాలో మొత్తంగా 20 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, అందులో ఇద్దరు మృతి చెందారు. రోజు రోజుకు కేసుల సంఖ్యం పెరుగుతుండడంతో గద్వాల పీజీ కళాశాలలో మరో క్వారంటైన్‌ను ఏర్పాటు చేసి కొత్తవారిని తరలించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.


జిల్లా కలెక్టర్‌తోపాటు ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో రాములు, మునిసిపాలిటీ ఛైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌లు కృష్ణవేణి చౌరస్తాకు చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రజలు ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతుండడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ఏరియాల్లో జనాలు తిరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాలలో భీంనగర్‌, హెల్డ్‌హౌజింగ్‌ బోర్డు, వేదానగర్‌, కుంట వీధి, మోహిన్‌మల్లా, షేరెళ్లీ వీధి, రాఘవేంద్ర కాలనీ, రెవెన్యూ కాలనీల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించారు.


మహబూబ్‌నగర్‌లో మంగళవారం మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. ఇందులో ఇదివరకు పాజిటివ్‌గా ఉన్న తండ్రి నుంచి ఆయన 23 రోజుల బిడ్డకు వైరస్‌ సోకింది. దీంతో పాటు ఆయన మతపర మైన తరగతులు బోధించడానికి వెళ్లిన ఓ ఇంట్లోని పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్‌ అం టుకున్నది. ఈలెక్కన మహబూబ్‌నగర్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 9కి చేరిం ది. మొత్తం 10 పాజిటివ్‌ కేసులుండగా, అందులో ఒకరు ఈనెల 5న డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు నమోదైన బీకే రెడ్డి కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేసి సెకండ్‌ కాంటాక్టులో ఉన్న వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఆ కాలనీలో సోడియం హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నారు.


రెడ్‌జోన్‌ పరిధిలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. జిల్లా కేంద్రానికి చెందిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో 17 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయించిన జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌ జిల్లా కేంద్రాన్ని రెడ్‌జోన్‌ పరిధిలోకి తేవాలని మంగళ వారం నిర్ణయించారు. అందులో భాగంగా యుద్ధప్రాతిపదికన శానిటైజేషన్‌ పనులను చేపట్టాలని ఆదేశించారు. ఇళ్ల నుంచి ఎవరు కదిలినా కఠినమైన చర్యలుంటాయని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2020-04-08T10:21:31+05:30 IST