-
-
Home » Telangana » Mahbubnagar » EVERYONE SHOULD FOLLOW RULES
-
నిబంధనలు పాటించాలి : ఆర్డీవో
ABN , First Publish Date - 2020-03-24T07:06:26+05:30 IST
కరోనా వైరస్ భారిన పడకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్డీ వో కార్యాయంలో...

కొల్లాపూర్, మార్చి 23 : కరోనా వైరస్ భారిన పడకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్డీ వో కార్యాయంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో పాటు ప్రధాన ఆలయాల పూజారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వరకు ప్రభుత్వం సూచించినట్లు ప్రజలు రోడ్లపైకి రావొద్దని, అత్యవసర సమయం లోనే బయటికి రావాలన్నారు.
ప్రభుత్వ నిబంధనలు తిరస్కరిం చి రోడ్లపై సంచరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హె చ్చరించారు. అదే విధంగా ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు తమ నివాస గృహాల వద్దే నిర్వహించుకోవాలని ఆలయాలకు వెల్లొద్దని పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో పరిస్థితిని తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ మురళీగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న పరిస్థితిని తమ దృష్టికి తీసుకరావాలన్నారు.