ప్రతి మొక్కను సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-02-08T10:13:34+05:30 IST

హరితహారంలో నాటిన ప్రతిమొక్కను సం రక్షించే బాధ్యత అధికారులపై ఉందని జిల్లా స్పెషల్‌ కలెక్టర్‌ సంతోష్‌ అ న్నారు. పల్లెప్రగతిలో భాగంగా జరుగుతున్న

ప్రతి మొక్కను సంరక్షించాలి

  • జిల్లా స్పెషల్‌ కలెక్టర్‌ సంతోష్‌

పెద్దమందడి: హరితహారంలో నాటిన ప్రతిమొక్కను సం రక్షించే బాధ్యత అధికారులపై ఉందని జిల్లా స్పెషల్‌ కలెక్టర్‌ సంతోష్‌ అ న్నారు. పల్లెప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీ లించడానికి శుక్రవారం ఆయన చిలకటోనిపల్లి, మంగంపల్లి, పామిరెడ్డిప ల్లిలో పర్యటించారు.  మొక్కలను పెంచడానికి ఏర్పాటుచేస్తున్న నర్సరీలను, గ్రామంలో సేకరించిన చెత్తకోసం ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డులను,  గ్రామంలోని పరిశుభ్రతను  సంతోష్‌ పరిశీలించారు. మంగంపల్లిలో మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరాను అడిగి తెలుసుకున్నారు. మంగంపల్లి  అభి వృద్ధిలో ముందు ఉందని ఆయన గుర్తించారు.  గ్రామ పంచాయతీ రికార్డు లను కూడా తనిఖీ చేశారు. ఎంపీడీవో నాగశేషాద్రి సూరి, ఎంపీపీ మేఘా రెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఏపీవో, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T10:13:34+05:30 IST