-
-
Home » Telangana » Mahbubnagar » every congress leader works like a solider
-
సైనికుల్లా పని చేద్దాం : జీఎంఆర్
ABN , First Publish Date - 2020-12-29T03:21:12+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్కరం సైనికులుగా పనిచేద్దామని టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి (జీఎం ఆర్) పిలుపునిచ్చారు.

కొత్తకోట/ వీపనగండ్ల/ పాన్‌గల్/ మదనాపురం/ పాన్‌గల్/ ఖిల్లాఘణపురం, డిసెంబరు 28: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్కరం సైనికులుగా పనిచేద్దామని టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి (జీఎం ఆర్) పిలుపునిచ్చారు. పట్టణంలోని చౌరస్తాలో ఓ వర్గం, పార్టీ కార్యాలయంలో మరో వర్గం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ప్రశాంత్, బాలమన్నెమ్మ, గొల్ల బాబు, నాగన్న సాగర్, బోయోజ్, కృష్ణారెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, నరేం దర్‌రెడ్డి, జేసీబీ రాము, సలీంఖాన్, రాము లుయాదవ్, వెంకటరమణ పాల్గొన్నారు. వీపనగండ్ల మండల కేంద్రంలోని గ్రామ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను మాజీ సర్పంచ్ బీరయ్య ఆవిష్కరించారు. పాన్‌గల్‌లోని బస్టాండ్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధు సూ దన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వహీద్, నరసింహరెడ్డి, ప్రకాష్ నాయుడు, నరసింహనాయుడు, కృష్ణనాయుడు, అఖిల్, బాలకృష్ణ, అరుణ్ పాల్గొన్నారు. మదనాపురంలో నిర్వహించిన ఆవిర్భావ వేడకులకు మధుసూద న్‌రెడ్డి హాజరై పార్టీ జెండాను ఎగరవేశారు. రామకృష్ణ, జగదీష్, వడ్డెకృష్ణ, మహే ష్‌కుమార్, వడ్డెబాలస్వామి, శేఖర్‌రెడ్డి, నాగన్న పాల్గొన్నారు. పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. అక్కి శ్రీనివాస్‌గౌడ్, విజయవర్ధన్‌రెడ్డి, రాజేందర్ ప్రసాద్, నాయకులు హరిశంకర్ రెడ్డి, రంజీత్, రాజశేఖర్, సురేందర్‌గౌడ్, బషీరుద్దిన్, వెంకట్‌సాగర్, దయాకర్ రెడ్డి, వెంకట్రాములు, జగదీశ్వర్‌రెడ్డి, సత్యం, రణధీర్‌రెడ్డి, చంద్రశేఖర్, మన్నెం, నర సింహనాయుడు, విజయవర్ధన్‌గౌడ్ పాల్గొన్నారు. ఖిల్లా ఘణపురంలోని తెలం గాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మున్నూరు జయాకర్, విజయలక్ష్మి, క్యామ బాలరాజు, మునగాల బాబు, కృష్ణయ్య దేవుజా ఉన్నారు.