ఎస్టీవోలో అవినీతిపై విచారణ

ABN , First Publish Date - 2020-12-20T02:45:22+05:30 IST

స్థానిక ఎస్టీవో కార్యాలయ ఉద్యో గుల అవినీతి ఉపాధ్యా య సంఘాల ఫిర్యాదు మేరకు శనివారం మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన ఆశాఖ ఉన్నతాధి కారులు విచారణ జరి పారు.

ఎస్టీవోలో అవినీతిపై  విచారణ
ఎస్టీవోలో విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు

గద్వాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్టీవో కార్యాలయ ఉద్యో గుల అవినీతి ఉపాధ్యా య సంఘాల ఫిర్యాదు మేరకు శనివారం మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన ఆశాఖ ఉన్నతాధి కారులు విచారణ జరి పారు. ఉద్యోగుల జీతాల బిల్లు పాస్‌ కావాలంటే ఎస్టీవో కార్యాలయంలో ముడపులు ముట్టచెప్పాల్సిన దుస్థితి చోటు చేసుకున్నది. పీఆర్టీయూ  ఎస్టీవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై హైదరాబాద్‌లోని ట్రెజరీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అధ్య క్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రదాన కార్యదర్శి తిమ్మప్ప మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించారు. ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ ఉమాదేవితో పాటు కృష్ణకుమార్‌ శనివారం ఉపాధ్యాయ సంఘం ఫిర్యాదు మేరకు విచారణ జరిపారు. ఎస్టీవో ఫైల్‌కు ఎంతెంత తీసుకుంటున్నాడని విచారణలో ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను హైదరబాద్‌కు పంపిస్తామని ఉమాదేవి తెలిపారు.  

Read more