ఎన్‌కౌంటర్ చేయాలి: ఎమ్మార్పీఎస్
ABN , First Publish Date - 2020-10-04T09:21:28+05:30 IST
యూపీలో దళిత యువతిని అత్యాచారం చేసి, చంపిన దుండగులను ఎన్‌కౌంటర్ చేయాలని ఎమ్మార్పీఎస్-టీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి
పాలమూరు, అక్టోబరు 3: యూపీలో దళిత యువతిని అత్యాచారం చేసి, చంపిన దుండగులను ఎన్‌కౌంటర్ చేయాలని ఎమ్మార్పీఎస్-టీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ సీతా రామరాజుకు ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులపై చిత్తశుద్ధి ఉంటే సీఎం యోగి ఆదిత్యానంద్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పి.జంబులయ్య, కె.రమేష్, నరేష్, కె.యాదయ్య ఉన్నారు.