ఆమె స్థానంలో ఆయన..ఎల్లూరులో సర్పంచ్‌ భర్త ఏలిక

ABN , First Publish Date - 2020-11-06T10:37:03+05:30 IST

కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ స ర్పంచ్‌ స్థానం మహిళది. కానీ, గ్రామానికి ఏలిక స్థానం మాత్రం భర్తదే. మహి ళ రిజర్వేషన్‌ కోటాలో సర్పంచ్‌గా గెలిచిన బండి లక్ష్మీదేవమ్మ ఉత్సవ విగ్రహం గా మారింది

ఆమె స్థానంలో ఆయన..ఎల్లూరులో సర్పంచ్‌ భర్త ఏలిక

అధికారిక కార్యక్రమాల్లో ఆయనదే పెత్తనం 


కొల్లాపూర్‌ రూరల్‌, నవంబరు 5: కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ స ర్పంచ్‌ స్థానం మహిళది. కానీ, గ్రామానికి ఏలిక స్థానం మాత్రం భర్తదే. మహి ళ రిజర్వేషన్‌ కోటాలో సర్పంచ్‌గా గెలిచిన బండి లక్ష్మీదేవమ్మ ఉత్సవ విగ్రహం గా మారింది. భర్త రాముడే అధికార కార్యక్రమాల బండిని లాగుతున్నారు. గురువారం జరిగిన గ్రామసభలో కూడా సర్పంచ్‌ లక్ష్మీదేవమ్మ చివరి వరసలో కుర్చుంటే ఆమె స్థానంలో ముందు వరసలో భర్త బండి రాముడు కూర్చొని గ్రామసభ అజెండాపై అధ్యక్షత వహించడంతో పాటు సమీక్ష నిర్వహించారు. సంబంధిత అధికారులు సర్పంచ్‌ స్థానంలో వారి భర్తలు అధికారం చెల్లాయిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలకే పరిమితమయ్యారు. ఇందుకు ఈ సం ఘటనే నిదర్శనం. 


అధికారం చెల్లాయించేది బండి రాముడు- పరశురాములు యాదవ్‌, 10వ వార్డు మెంబరు 

గ్రామంలో సర్పంచ్‌ లక్ష్మీదేవమ్మ అయితే అధికారం చెల్లాయించడంతో పా టు, సర్పంచ్‌గా పిలవాలని పంచాయితీ సిబ్బందికి, అధికారులకు, ప్రజలకు బం డి రాముడు హుకూం జారీ చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికార పార్టీ వ్యక్తి కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేపోతున్నారు. 

Updated Date - 2020-11-06T10:37:03+05:30 IST