18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T04:38:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటు నమోదు కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అఽధికారి శశిధర్‌ అన్నారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి
ఓటు నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న శశిధర్‌

రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారి శశిధర్‌మరికల్‌, డిసెంబరు 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటు నమోదు కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అఽధికారి శశిధర్‌ అన్నారు. శనివారం మరికల్‌తోపాటు పెద్దచింతకుంట గ్రామంలో ఓటు నమెదు కార్యక్రమాన్ని ఆక్మ సికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శశిధర్‌ మాట్లాడుతూ 2021 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. మరణించిన వారిపేర్లు తొలగించి కొత్త ఓటర్ల పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఎలాంటి తప్పలూ లేకుండా చూసుకోవాలని అఽధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా సర్వే అఽధికారి శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్‌ తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు. 


పురాతన బావి పరిశీలన 


ధన్వాడ : ధన్వాడలోని వెంకటేశ్వర స్వామి పురాతన బావిని శనివారం సా యంత్రం కలెక్టర్‌ హరిచందన పరిశీలించారు. పురాతన బావిని అభివృద్ధి చే యాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర  బృందంతో కలిసి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట అధికారులు ఉన్నారు.


కలెక్టర్‌కు వినతి


దామరగిద్ద : గ్రామాల్లో జరుగుతున్న శ్మశాన వాటిక, రైతువేదిక, రైతు కల్లా లు, సీసీ రోడ్ల పనులకు ఇసుక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొం టు న్నామని, సరిపడా టోకెన్లు ఇవ్వాలని కోరుతూ శనివారం దామరగిద్ద మం డల నాయకులు కలెక్టర్‌ హరిచందనకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పనుల కు సరిపడా టోకెన్లు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, జడ్పీటీసీ లావణ్య, వైస్‌ ఎంపీపీ దామో దర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా నాయకులు సుభాష్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. 

Updated Date - 2020-12-06T04:38:01+05:30 IST