-
-
Home » Telangana » Mahbubnagar » election carefull
-
ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-28T03:15:50+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.

మహబూబ్‌నగర్ కలెక్టరేట్, నవంబరు 27: జీహెచ్‌ఎంసీ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శుక్రవారం జేజే ఆర్‌గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జీహెచ్ ఎంసీ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ఆయన మఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇప్పటి వరకు ఎలకా్ట్రనిక్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించగా, జీహె చ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్‌పై నిర్వహిస్తున్నారని తెలిపా రు. జిల్లా నుంచి 1035 మందికి పైగా సిబ్బందిని జీహెచ్‌సీ ఎన్ని కల విధులకు నియమించామని, వీరందరికి శిక్షణ ఏర్పాట్లు చేసి నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సిబ్బంది కోసం ఈ నల 30న హైదరాబాద్ వెళ్లేందుకు జిల్లా కేంద్రంతోపాటు ఇతర ఎంపి క చేసిన ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాట్లు చేయనున్నట్లు కలె క్టర్ వెల్లడించారు. సిబ్బంది అందరూ ఉదయం ఏడున్నర గంట లకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులు ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల విధులపట్ల నిర్లక్షం వహించ వద్దని, అంతేగాక ఎవరైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు హాజరు కాకుంటే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజ స్ నందలాల్ పవర్, నారాయణ పేట ఆర్‌డీఓ చీర్లా శ్రీనివాస్‌లు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ,హైద్రాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి రాధరోహిణి తదితరులు హాజరయ్యారు.