8 నుంచి జేఎల్‌ఎంలకు సంకల్ప్‌ శిక్షణ

ABN , First Publish Date - 2020-12-06T04:22:01+05:30 IST

జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం)లకు డిసెంబరు 8నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో సంకల్ప్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌ఈ పి.భిక్షపతి ప్రకటించారు.

8 నుంచి జేఎల్‌ఎంలకు సంకల్ప్‌ శిక్షణ

పాలమూరు, డిసెంబరు 5: జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం)లకు డిసెంబరు 8నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో సంకల్ప్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌ఈ పి.భిక్షపతి ప్రకటించారు. శనివారం ఆయన ఆంధ్ర జ్యోతితో మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లా-78, నారాయ ణపేట జిల్లా-28 మంది జేఎల్‌ఎంలకు ఒక్కో బ్యాచ్‌కు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. మీటర్‌ రీడింగ్‌, ట్రాన్స్‌ ఫార్మర్‌, లైన్స్‌, హైటెన్ష్‌న్‌ లైన్స్‌ నుంచి వి ద్యుత్‌ సరఫరా, విడి భాగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. 

Updated Date - 2020-12-06T04:22:01+05:30 IST