గండీడ్‌ను వికారాబాద్‌లో కలిపేందుకు కృషి

ABN , First Publish Date - 2020-09-17T10:52:20+05:30 IST

గండీడ్‌ మండలాన్ని తిరిగి వికారాబాద్‌ జిల్లాలో కలిపేందుకు బీజేపీ కేంద్ర మంత్రులు, నాయకులతో చర్చించి, తమ వంతు కృషి

గండీడ్‌ను వికారాబాద్‌లో కలిపేందుకు కృషి

చేవెళ్ల పార్లమెంట్‌ బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జనార్ధన్‌రెడ్డి


గండీడ్‌, సెప్టెంబరు 16: గండీడ్‌ మండలాన్ని తిరిగి వికారాబాద్‌ జిల్లాలో కలిపేందుకు బీజేపీ కేంద్ర మంత్రులు, నాయకులతో చర్చించి, తమ వంతు కృషి చేస్తామని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జనార్ధన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా బుధవారం గండీడ్‌లో మండల నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనార్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా దేశంలో ప్రధాని సేవలు అందిస్తున్నారన్నారు. రామ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుంద న్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మండల నాయకులను అభినం దించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గిరమోని శ్రీనివాస్‌, కమతం రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ప్రభునాయక్‌, కుర్వ కృష్ణ, వెంకటయ్య, కుర్వ మైబు, గోపాల్‌, కృష్ణచ బాలు, విష్ణు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T10:52:20+05:30 IST