పీఆర్‌సీ ఐఆర్‌ సాధనకు కృషి

ABN , First Publish Date - 2020-12-28T03:17:31+05:30 IST

సీఎం కేసీఆర్‌తో చర్చించి ఉ ద్యోగుల పీఆర్‌సీ ఐఆర్‌ సాధనకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మె ల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నా రు.

పీఆర్‌సీ ఐఆర్‌ సాధనకు కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

 - ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ 

కల్వకుర్తి అర్బన్‌, డిసెంబరు 27: సీఎం కేసీఆర్‌తో చర్చించి ఉ ద్యోగుల పీఆర్‌సీ ఐఆర్‌ సాధనకు కృషి చేస్తానని  కల్వకుర్తి ఎమ్మె ల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నా రు. పట్టణంలోని యూటీఎఫ్‌ భ వన్‌లో ఆదివారం టీఎస్‌ యూటీ ఎఫ్‌ జిల్లా మూడవ మహాసభ, యాదగిరిచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎంపీ పొతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి  పెద్ద పీట వేసిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం విరమించుకుంటానన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠా కూర్‌ బాలజీ సింగ్‌, జడ్పీటీసీ పొతుగంటి భరత్‌ ప్రసాద్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం,  టీఎస్‌యూటీఎఫ్‌, కేవీపీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-28T03:17:31+05:30 IST