రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-12-04T03:30:39+05:30 IST
పత్తి విక్రయించేందు కు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఇబ్బం దులకు గురి చేస్తే చర్యలు తప్పవు అని కలెక్టర్ శర్మన్, ఎ మ్మెల్యే జైపాల్ యాదవ్‌లు అధికారులను హెచ్చరించారు.

కల్వకుర్తి అర్బన్, డిసెంబరు 3: పత్తి విక్రయించేందు కు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఇబ్బం దులకు గురి చేస్తే చర్యలు తప్పవు అని కలెక్టర్ శర్మన్, ఎ మ్మెల్యే జైపాల్ యాదవ్‌లు అధికారులను హెచ్చరించారు. గురువారం కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గేట్ సమీపంలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని వారు సంద ర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడి వివ రాలను సేకరించారు. ట్రాక్టర్లతో వచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే చర్యలు తప్పవని అన్నా రు. అనంతరం పత్తి తేమ శాతంను పరిశీలించారు. అం తకు ముందు గణేష్ జిన్నింగ్ మిల్లో దగ్ధం అయిన ప త్తిని వారు పరిశీలించారు. వారి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాల య్య, వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, ఆర్డీవో రాజేష్ కుమార్ , డిటీ హరింద్ర రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, మాజీ వైస్ ఎంపిపి వెంకటయ్య గౌడ్, సీసీఐ సిబ్బంది పలువురు నాయకులు ఉన్నారు.