కాన్పునకు కరోనా ముప్పు

ABN , First Publish Date - 2020-05-10T10:25:52+05:30 IST

మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి 9 నెలల వరకు వైద్యుడి పర్యవేక్షణలో ఉండాలి. కచ్చితంగా యాంటి నెంటల్‌ చెకప్స్‌

కాన్పునకు కరోనా ముప్పు

పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని డాక్టర్లు

సిబ్బందితో సహా అందరూ కరోనా విధులకు

లాక్‌డౌన్‌తో తెరుచుకోని ప్రైవేట్‌ ఆసుపత్రులు

ఏఎన్‌సీ చేయించుకోలేకపోతున్న గర్భిణులు

రక్తహీనత, పౌష్టికాహార లోపంతో సమస్యలు

చిన్న కారణాలతో పీహెచ్‌సీల నుంచి పెద్దాసుపత్రులకు రెఫర్‌ కేసులు

కాన్పు సమయంలో గాల్లో కలుస్తున్న ప్రాణాలు


ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్‌సీలు, పెద్దాసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పించింది.. అయినా, గర్భిణుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరికి వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి.. పీహెచ్‌సీల నుంచి జిల్లా స్థాయిలోని పెద్దాసుపత్రుల వరకు డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.. అలాగే గర్భం దాల్చిన నాటి నుంచి సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, మందులు వేసుకోకపోవడంతో రక్తం లేక, బీపీ ఎక్కువై, ఫిట్స్‌ రావడం, బ్లీడింగ్‌ కావడం వంటి కారణాలతో చివరి క్షణంలో ఆసుపత్రులకు వచ్చి గర్భిణులు మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి..


మహబూబ్‌నగర్‌, వైద్యవిభాగం:మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి 9 నెలల వరకు వైద్యుడి పర్యవేక్షణలో ఉండాలి. కచ్చితంగా యాంటి నెంటల్‌ చెకప్స్‌ (ఏఎన్‌సీ) చేయించుకోవాలి. అప్పుడే సుఖ ప్రసవం జరిగి, తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారు. కానీ, ఈ 9 నెలల కా లంలో గర్భిణీకి సరైన వైద్యం అందడం లేదు. ప్రస్తుత లా క్‌డౌన్‌లో ఏ పీహెచ్‌సీలో డాక్టర్లు లేరు. వైద్య సిబ్బంది కూ డా కరోనా డ్యూటీలకు వెళ్లారు. ఆశ కార్యకర్తలు సైతం ఇం టింటిటీ తిరిగి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు సైతం మూతపడ్డాయి. దీంతో గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లోని గర్భిణులు ఏఎన్‌సీలు చేయించుకో లేదు. కాన్పునకు రావాలన్నా, రెగ్యులర్‌ చెకప్‌లు చేయించు కోవాలన్నా జిల్లా ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో సరైన వైద్యసేవలు అందక గర్భిణులు ప్రాణా లు కోల్పోతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ గర్భిణీ కూడా ఇలాగే ప్రాణాలు విడిచింది. నారాయణపేట కు చెందిన మరో గర్భిణీ గర్భస్రావం జరిగి, గర్భసంచి వి చ్ఛిన్నమై చనిపోయింది. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఇద్ద్దరు కూడా కాన్పు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


రక్తహీనత, పౌష్టికాహార లోపం

చాలా మంది గర్భిణీలకు రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉందని వైద్యులు గుర్తించారు. గర్భం దాల్చిన నాటి నుంచి ఆ మహిళ ఐరన్‌, క్యాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వే సుకోవాలి. మిగతా రోజుల కంటే రెండు రెట్లు పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ, మందులు వాడకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో చాలా మంది రక్తహీనతతో బాధపడుతు న్నారు. కాన్పు సమయంలో బీపీ పెగరడం, ఫిడ్స్‌ రావడం, బ్లీడింగ్‌ కావడం, మాయ కిందికి జారడం వంటివి జరుగు తున్నాయి. ఇలాంటి చివరి క్షణంలో ఆసుపత్రులకు వస్తుండ టంతో, ఎంత ప్రయత్నం చేసినా వైద్యులు వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆపరేషన్‌ థియేటర్‌లో టేబుల్‌పైనే చనిపోతున్నారు. దీంతో పాటు చి న్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడంతో కూడా కాన్పు సమ యంలో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు.


పర్యవేక్షణ లేకనే..

క్షేత్రస్థాయి పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూ నిటీ ఆసుపత్రులలోనే కాన్పులు చేయాలి. అందుకు తగిన సౌకర్యాలు అన్ని ఆసుపత్రులలో ఉన్నాయి. కానీ, డాక్టర్లు ప ట్టించుకోకపోవడంతో జిల్లా ఆసుపత్రులకు గర్భిణులు రావా ల్సి వస్తున్నది. రక్తం లేదని, బీపీ పెరుగుతుందనే చిన్న కార ణంతోనే పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆసుపత్రులకు రెఫర్‌ చే స్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ కావడం తో, అప్పటి కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ఎవరైనా చిన్న కారణంతో జిల్లా ఆసుపత్రులకు గర్భిణులను రెఫర్‌ చేసే వారిపై క్రిమి నల్‌ కేసులు పెడతానని హెచ్చరించారు. కానీ, ఇటీవల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెఫరల్‌ వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. 


Updated Date - 2020-05-10T10:25:52+05:30 IST