చదువుకు దూరం చేయొద్దు: ఏఎస్పీ
ABN , First Publish Date - 2020-12-30T03:24:56+05:30 IST
బాలలను చదువుకు దూరం చేయొద్దని అడిషినల్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబరు 29: బాలలను చదువుకు దూరం చేయొద్దని అడిషినల్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన మాట్లాడారు. బాల కార్మికులను చేరదీసేందుకు జనవరిలో పోలీస్, లేబర్ శాఖ, సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో అన్ని శాఖలతో కలిసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూల కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ యాదయ్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వెంకటరమణ పాల్గొన్నారు.