అమరుల త్యాగాలు మరువలేనివి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-12T10:31:24+05:30 IST

అడవులను కాపాడే క్రమంలో ఎందరో అధికారులు సంఘ విద్రోహుల చేతుల్లో మరణిస్తున్నారని, ఆ అమ రుల త్యాగాలు ..

అమరుల త్యాగాలు మరువలేనివి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 11: అడవులను కాపాడే క్రమంలో ఎందరో అధికారులు సంఘ విద్రోహుల చేతుల్లో మరణిస్తున్నారని, ఆ అమ రుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. అటవీ శాఖ అమరుల దినోత్సవ ాన్ని పురస్కరించుకుని శుక్రవారం శాఖ కార్యాలయ ఆవరణలోని అమరుల స్థూపం వద్ద కలెక్టర్‌ పుష్పగు చ్ఛాలు ఉంచి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ సంపద లైన అడవులను సంరక్షిండం, స్మగ్లింగ్‌ను అరికట్టే క్రమంలో అసువులు బాసిన వారిని స్మరించుకోవడం అవసరమన్నారు. అధికారులు, సిబ్బంది కోసం జిల్లా స్థాయిలో ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తే మరింత ధైర్యంతో ముందుకు వెళ్తారన్నారు. అనంతరం శాఖ కార్యాలయ ఆవరణలో కలెక్టర్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో రేంజ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


ఈ ఆఫీస్‌ విధానంతో పారదర్శకత

ఇంజనీరింగ్‌ శాఖలో జిల్లాలోనే మొదటి సారిగా ఈ ఆఫీ స్‌ విధానాన్ని అమలు చేయడం జరిగిందని, ఈ విధానంతో ఫైల్స్‌ పారదర్శకతతో నిర్వహించే అవకాశం ఉటుందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు. శుక్రవారం జిల్లా ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ కార్యాలయ ఈ ఆఫీస్‌ను కలెక్టర్‌ యన్‌ఐసీలో ప్రారంభించారు. కార్యక్రమంలో యన్‌ఐసీ డీఐఓ సత్యనారాయణ మూర్తి, ఈ ఆఫీస్‌ జిల్లా అధికారి వాసుదేవరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యా లయ ఈఈ గురుభాగ్యం, సూపరిటెండెంట్‌ రాములు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


ఇద్దరు నైట్‌ డ్యూటీలో ఉండాలి

స్టేట్‌ హోమ్‌లో ఉండే ఆడ పిల్లల రక్షణ కోసం నైట్‌ డ్యూటీ చేసేందుకు ఇద్దరు తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరో ఇద్దరు హోమ్‌ గార్డులను నియమించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అందుకోసం ఎస్పీకి లేఖ రాయాలని చెప్పారు. కలెక్టర్‌ శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. స్టేట్‌ హోం ప్రహరీ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్కడ పనిచేసే ఆయ పద్మమ్మను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. స్టేట్‌ హోం మేనేజర్‌ వెంకటరమణమ్మను విచారణ అధికారిగా వేసినట్లు తెలిపారు. త్వరలో ఏసీడీపీఓను నియమించాలని జిల్లా వెల్ఫేర్‌ అధికారికి సూచించారు. సమావేశంలో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి వెంకట్రావు, జడ్పీ సీఈఓ యాదయ్య, డిడబ్ల్యూఓ రాజేశ్వరి, సీడబ్ల్యూసీ చైర్మన్‌ శ్రీధర్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ హనుమప్ప, సఖి సెంటర్‌ మంజుల పాల్గొన్నారు.


పీడీ చట్టం నమోదు చేయండి

ప్రజా పంపిణీ రేషన్‌ బియ్యం విషయంలో ఎవరైనా అక్ర మాలకు పాల్పడితే వారిపై పీడీ చట్టం నమోదు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. శుక్రవాకం ఆయన కలెక్టర్‌ కార్యాలయం నుంచి పౌర సరఫరాలపై వెబ్‌ ఎక్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సివిల్‌ సప్లయ్‌ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో తహసీ ల్దార్‌ 3 నుంచి 4 రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి, చౌక ధరల దుకాణాలను తనఖీ చేయాల న్నారు. అనంతరం రిపోర్టులు ఇవ్వాలని చెప్పా రు.


గత ఏడాది వరి ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఉండేదని, ఈ సారి పత్తి సేకరణకు అంతే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలన్నారు. 800 మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ చేస్తున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి షాప్‌ దగ్గర రెవెన్యూ లేదా ఇతర ఉద్యోగులను ఏర్పాటు చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి వనజాత పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T10:31:24+05:30 IST