నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ

ABN , First Publish Date - 2020-04-08T10:29:40+05:30 IST

మండల కేంద్రమైన ధన్వాడలో నివాసం ఉంటున్న నిరుపేదలకు 2009-2010 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు

నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ

ధన్వాడ, ఏప్రిల్‌ 7 : మండల కేంద్రమైన ధన్వాడలో నివాసం ఉంటున్న నిరుపేదలకు 2009-2010 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు మంగళవారం  ఉచితంగా నిత్యావసర సరకులను అందజేశారు. నేరుగా ఇంటికి వెళ్లి ఒక్కోక్క కుటుంబానికి 11 వస్తువలను అందించారు. అదేవిధంగా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఊసు బాలకృష్ణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్‌డౌన్‌లో ఉన్న పోలీసులు, అధికారులు, పంచాయతీ సిబ్బందికి అన్నదానం చేశారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

Updated Date - 2020-04-08T10:29:40+05:30 IST