-
-
Home » Telangana » Mahbubnagar » development wanaparthy mandal is first
-
అభివృద్ధిలో వనపర్తి ఫస్ట్
ABN , First Publish Date - 2020-12-29T03:19:27+05:30 IST
పల్లె ప్రకృతివనం, రైతు వేదికలు వంటి పథకాలను పూర్తిచేయడంతో జిల్లాలో వనపర్తి మండలం మొదటి స్థానంలో ఉందని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

జడ్పీ చైర్మన్ రాకాసి లోక్‌నాథ్‌రెడ్డి
వనపర్తి రూరల్, డిసెంబరు 28: పల్లె ప్రకృతివనం, రైతు వేదికలు వంటి పథకాలను పూర్తిచేయడంతో జిల్లాలో వనపర్తి మండలం మొదటి స్థానంలో ఉందని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని అచ్యుతాపూర్ గ్రామంలో సోమవారం పల్లె ప్రకృతివనాన్ని ఆయన ప్రారంభించారు. మొక్కలు ఎండిన చోట కొత్త మొక్కలు నాటి నీళ్లు పోశారు. సర్పంచ్ శారద, ఆశన్న నాయుడు, ఉపసర్పంచ్ లక్ష్మీగంగయ్య, సింగిల్‌విండో డైరెక్టర్ శివకుమార్‌రెడ్డి, వార్డుసభ్యులు బాలయ్య, లక్ష్మీ, అలివేల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.