-
-
Home » Telangana » Mahbubnagar » Development funding table details should be kept
-
అభివృద్ధి నిధుల వివరాల పట్టిక పెట్టాలి : బీజేపీ
ABN , First Publish Date - 2020-12-31T03:57:00+05:30 IST
రాష్ట్రంలో ఏయే పనులకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు తెలిపేందుకు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల ముందు వివరాల పట్టికను పెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.

నారాయణపేట టౌన్, డిసెంబరు 30 : రాష్ట్రంలో ఏయే పనులకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు తెలిపేందుకు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల ముందు వివరాల పట్టికను పెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌తో కలిసి విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రధాని ఫొటో పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధన్వాడలో ప్రధాని చిత్రపటాన్ని దహనం చేసిన టీఆర్‌ఎస్ నాయ కులపై చర్యలు తీసుకోవాలని, లాఠీచార్జీకి కారణమైన, ప్రజా ప్రతినిధులను బెదిరించిన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేటలో రోడ్డు వెడల్పుతో స్థలాన్ని కోల్పోయి న బాధితుడు ఉన్న స్థలంలో షెడ్ వేసుకోగా మునిసిపల్ అధికారులు తొలగించారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గోపిని నామాజీతో పాటు పలువురు నాయకులు సన్మానించారు. సమావేశంలో బీజేపీ నాయకులు సిద్రామప్ప, భాస్కర్, ప్రభాకర్ వర్దన్, నర్సింగ్, సత్యరఘు పాల్, రఘురామయ్య గౌడ్ పాల్గొన్నారు.