తగ్గుతున్న కేసులు
ABN , First Publish Date - 2020-09-14T10:49:35+05:30 IST
ఉమ్మడి పాలమూరు జిల్లా లో కొవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం 365 కేసులు నమోదవగా, ఆదివారం
ఉమ్మడి పాలమూరులో 258 మందికి కరోనా
నారాయణపేట జిల్లాలో ఒకరి మృతి
మహబూబ్‌నగర్ (వైద్య విభాగం) / గద్వాలక్రైం/ నారాయణపేట క్రైం/ వనపర్తి/కందనూలు, సెప్టెంబరు 13: ఉమ్మడి పాలమూరు జిల్లా లో కొవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో శనివారం 365 కేసులు నమోదవగా, ఆదివారం 258 కేసులు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం 83 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో 37 మందికి వైరస్ సోకింది. జడ్చర్ల మండలంలో 20 కేసులు నమోదవగా, ఇతర మండలాల్లో 26 మందికి కరోనా సోకింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలో 11 మందికి, అయిజ మండలంలో ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. ఇతర మండలాల్లో మరో 20 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 100 మంది కరోనా బారిన పడ్డారు. అందులో నాగర్‌కర్నూల్ మండలంలో 20 కేసులు కల్వకుర్తి మండలంలో 20 కేసులు నమోదయ్యాయి. మండలాలవారీగా అచ్చంపేటలో 16, కొల్లాపూర్‌లో 13 మందికి వైరస్ సోకగా, ఇతర మండలాల్లో మరో 31 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
నారాయణపేట జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మరికల్ మండలం తీలేరులో ఒకరు వైరస్ బారిన పడ్డారు. మక్తల్ మండలం ఖానాపూర్‌లో మరొకరు కరోనా సోకి మృతి చెందారు.
వనపర్తి జిల్లాలో 35 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో వనపర్తి మండలంలో 20 మందికి వైరస్ సోకగా, ఇతర మండలాల్లో 15 మంది కరోనా బారిన పడ్డారు.