మరో శబరిమలగా పద్మావతి కాలనీ అయ్యప్ప కొండ

ABN , First Publish Date - 2020-12-18T05:08:19+05:30 IST

జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయం మరో శబరిమలగా విరాజిల్లుతోంది.

మరో శబరిమలగా పద్మావతి కాలనీ అయ్యప్ప కొండ
పద్మావతి కాలనీలోని అయ్యప్ప ఆలయం

  దినదినాభివృద్ధి చెందుతున్న అయ్యప్ప ఆలయం 

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం డిసెంబరు 17: జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయం మరో శబరిమలగా విరాజిల్లుతోంది. అయ్యప్ప భక్తులు మణికంఠ మాల ధరించేందుకు కొండ పైకి వస్తుండటంతో  50రోజులుగా నిత్యం అయ్యప్ప స్వాముల శరణు ఘోషలతో ఆలయం మార్మోగి పోతోంది. వందలాది మంది అయ్యప్ప భక్తులు గురుస్వాములు  పంబ రాజు, అన్వేష్‌ గురుస్వాముల సమక్షంలో మాల ధరిస్తున్నారు. . అయ్యప్పమాల ధరించిన స్వాములే కాకుండా భక్తులు నిత్యం స్వామివారిని దర్శించుకుం టున్నారు. దీంతో ఆలయం రద్దీగా కనిపిస్తుంది.  ప్రతీ బుధవారం స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

  23 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం  

పాలమూరు పట్టణంలో అయ్యప్ప స్వామి దేవా లయ నిర్మాణ పనులు 23 ఏళ్ల క్రితం ప్రారం భించారు. అప్పటి కలెక్టర్‌, మంత్రి సహకా రంతో పద్మావతి కాలనీ కొండపై ఉన్న స్థలాన్ని సేకరించి అక్కడ మొదట గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాల ను ప్రతిష్టించి గుడి కట్టారు. అనంతరం మణి కంఠ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి అనంతరం గుడి నిర్మాణ పనులు చేపట్టినట్లు పూర్వీ కులు చెబుతున్నారు. అయ్యప్ప సేవా సమాజం ఏర్పాటు నిధులను సేకరించి పను లు త్వరగా పూర్తిచేసినట్లు వారు తెలిపారు. 

 ఏకశిలా దివ్య పదునెట్టాంబడి 

 రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా  జిల్లా కేంద్రంలోని  అయ్యప్ప స్వామి  దేవాలయాన్ని ఏకశిలతో రూపొందించారు. దీంతో ఈ ఆల యానికి ఎంతో విశిష్టత సంతరించకున్నది. శబరిమల అయ్యప్ప దేవా లయాన్ని తలపించేలా నిర్మాణం చేపట్టారు. స్వామివారి పదునెట్టాంబడి (పడి మెట్లు)ని కూడా  18 మెట్లు కూడా ఏకశిలతోనే తయారుచేసినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. 

60 రోజుల పాటు నిత్యాన్నదానం

అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ఆరంభం నుంచి డిసెంబరు 31వరకు అన్నదానం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1గంట నుంచి మూడు గంటల వరకు అన్నదానం నిర్వహిస్తారు. ప్రతీరోజూ సుమారు 200 మంది భక్తులు అన్నదానానికి తరలివస్తు న్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 డిసెంబరు 25న మహా పడి పూజ 

పద్మావతి కాలనీలోని అయ్యప్ప ఆలయంలో ప్రతీ ఏడాది డిసెంబరు 25న మహా పడిపూజ ఘ నంగా నిర్వహిస్తారు.  ఈ పూజకు తిరుపతికి చెంది న వేంకటేశ్వర శర్మ గురుస్వామి, పాలమూరు పట్టణ గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 5గంటలకు సుప్రభాత సేవ, 5.30కి గణపతి నవగ్రహ హోమం, 8.30కి స్వచ్ఛంద రక్తదాన, నేత్రదాన శిబిరాలు, 9గంటలకు తూర్పు కమాన్‌ రామాలయం నుంచి కలశ, స్వా మి వారి పల్లకి ఉరేగింపు .10 గంటలకు అహాషేకం . మధ్యాహన్నం 1గంటకు అన్నదానం, సాయంత్రం 6గంటల నుంచి అయ్యప్ప స్వామి మహా పడి పూజ నిర్వహిస్తారు.

Updated Date - 2020-12-18T05:08:19+05:30 IST