-
-
Home » Telangana » Mahbubnagar » dappu
-
డప్పు కొట్టే, చెప్పు కుట్టే వారికి ఫించన్లు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-20T03:08:50+05:30 IST
రాష్ట్రంలోని డప్పు కొట్టే, చెప్పులు కుట్టే ప్రతీ ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.

రాజాపూర్, డిసెంబరు 19: రాష్ట్రంలోని డప్పు కొట్టే, చెప్పులు కుట్టే ప్రతీ ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఓట్ల కోసమై మాదిగలను ఉపయోగించుకుంటున్నారని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన జిల్లా కేంద్రంలో ప్రతీ నియోజకవర్గం కమిటీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి జంబు లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదయ్య, కాలే రమేష్, కృష్ణయ్య, లక్ష్మయ్య, జగదీష్, కాలే యాదయ్య, రవి, పెద్ద నర్సింహ పాల్గొన్నారు.