దళితుల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-11-28T03:13:34+05:30 IST

షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ అన్నారు.

దళితుల అభివృద్ధికి కృషి చేయాలి
మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్‌ సభ్యులు చిలకమర్రి నర్సింహ

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ 

ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ చట్టంపై సమావేశం


మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 27 : షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ  అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిష త్‌ అధ్యక్షుడు, జడ్పీటీసీలు, మునిసిపల్‌ చైర్మన్‌లు, కౌన్సిలర్లకు షెడ్యూల్డ్‌ కులాలు, తెగలవారిపై దాడులు నివారణకు ఉద్దేశించి తీసుకొచ్చిన చట్టంపై వెబినార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పించారు. షె ముఖ్యంగా గ్రామాలలో దళితులు, గిరిజనులపై దాడులు జరగకుండా చూసుకోవడమే కాకుండా, అంటరానితనం, అస్పృశ్యత నివార ణ, రెండు గ్లాసుల విధానం వంటివి లేకుండా చూ సుకోవాలని, అంటరానితనం, అస్పృశ్యత నివారణ, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి ఆయన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీలపై దాడు లు జరిగినప్పుడు నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వకుండా చూడాలని, దాడులు జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకునేలా ఉండాలని సూచిం చారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను ఆయా కమి టీలలో భాగస్వాములను చేయాలని కోరారు. తండాల స్థానంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో తాగునీరు, రహదారుల వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా ఎస్సీ కాల నీలలో రోడ్లు, మురుగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలోనూ మాట్లాడారు. విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 100 యూనిట్ల లోపు విని యోగించిన ఎస్సీ, ఎస్టీల వారు బిల్లులు చెల్లించా ల్సిన అవసరం లేదని, ఇందుకు గాను వారు ఆధా ర్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఇస్తే సరిపోతుందని తెలి పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కులాల, తగలవారిపై దాడులు జరగకుండా అవగాహన కల్పించామని తెలిపారు. గ్రామ, మండల స్థాయి లో నిర్వహించే సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వాములను చేసే లా సర్క్యులర్‌ జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరు చేసే రుణాలకు సంబంధించి లబ్ధిదారులు మందుగా బ్యాంకుల్లో ఎలాంటి డిపాజిట్లు చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై బ్యాంకర్లకు లేఖ రాస్తానని వెల్ల డించారు. ఈ వెబినార్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రనీల్‌ చంద ర్‌, ఎంపీటీసీల  సంఘం జిల్లా అధ్యక్షుడు రఘు నాథ్‌, జడ్పీ చైర్మన్‌ యాదయ్య, మూసాపేట్‌ ఎంపీ టీసీ సత్యనారాయణ, అయ్యవారిపల్లె సర్పంచు సునీత, గండీడ్‌ మండలం బోయినపల్లి సర్పంచ్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీపీ సదాశ్రీ, అడ్డాకుల ఎంపీటీసీ గణేష్‌, రాజాపూర్‌ జడ్పీటీసీ మోహన్‌ నాయర్‌, సర్పంచుల సంఘం భూత్పూర్‌ మండల అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడారు. ఈ కార్యక్ర మానికి ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ యాదయ్య, ఆర్‌డీవో శ్రీనివాస్‌, డీఎస్పీ శ్రీధర్‌, డీపీవో వెంకటే శ్వర్లు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ యాదయ్య తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2020-11-28T03:13:34+05:30 IST