డబుల్‌ ప్రక్రియను వారంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-08T03:38:47+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లాటరీ పద్ధతిన ఇచ్చే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

డబుల్‌ ప్రక్రియను వారంలో పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


కలెక్టరేట్‌, డిసెంబరు 7: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లాటరీ పద్ధతిన ఇచ్చే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్షిం చారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను రిజర్వేషన్‌  ప్రకారం లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. జాబితాను మరోసారి పూర్తిగా పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డులు, నివాస గృహాల చిరునామాలను పరిశీలించి ఇల్లు లేని వారికి మాత్రమే కేటాయించాలన్నారు. గతంలో ఇల్లు ఉన్న వారికి కేటాయించిన అధికారులపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు ఉండి కూడా లబ్ధి పొందినట్లైతే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఏనుగొండలో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలను, ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కేసీఆర్‌ అర్బన్‌ పార్కు, శిల్పారామం, ట్యాంక్‌ బండ్‌, పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ, నూతన కలెక్టర్‌ నిర్మాణం, బైపాస్‌ రోడ్డు పనులపై సమీక్షించారు. రూ.100 కోట్లతో జిల్లాకు మంజూరైన 5 మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిరాణాలకు స్థలాల ను గుర్తించాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నందలాల్‌ పవర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


10 నుంచి కోయిల్‌సాగర్‌ నీటి విడుదల

 కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు కింద యాసంగి పంటలకు కుడి, ఎడమ కాలువల కింద ఈ నెల 10 నుంచి నీటిని విడుదల చేయాలని ఆయకట్టుదారుల సమన్వయ కమిటీ సమావేశం తీర్మానించింది. 2021 మార్చి మొదటి వారం వరకు నీటిని విడుదల చేయనున్నారు. మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన రెవెన్యూ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో ఏటా నీరు తక్కువగా ఉండటం వల్ల తాగు, సాగు నీటి కోసం గొడవలు జరిగేవని చెప్పారు. గత సంవత్సరం ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంలో రైతుల కోరిక మేరకు ప్రాజెక్టు నుంచి తాగు నీరు అందించే విషయాన్ని వేరు చేయాల్సిందిగా సీఎం దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించారన్నారు. ప్రాజెక్టు నీటిని పూర్తిగా సాగు నీటికి మాత్రమే వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాలువల ఆధునీకరణ కోసం రూ.38 కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు ఉన్నందున యాసంగి పంట పూర్తి కాగానే కాలువల మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు ఎత్తును మరికొంత పెంచితే ప్రాజెక్టు కింద ఉన్న మరో 5 గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందుతుం దన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులో సరిపోయినంత నీరు ఉన్నందున మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేం దుకు కూడా ఇబ్బందులు లేవన్నారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజ్‌స నందలాల్‌పవర్‌, ఆర్డీవో శ్రీనివా్‌స, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T03:38:47+05:30 IST