కర్రనే విద్యుత్‌ స్తంభం

ABN , First Publish Date - 2020-12-27T03:33:29+05:30 IST

పంట పొలాల్లో విద్యుత్‌ వైర్లు తగిలి రైతుల ప్రాణాలు పోతున్నా మండల విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మల్లేపల్లి గ్రామ పంచాయతీ సోమ్లా తండా వాసులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్రనే విద్యుత్‌ స్తంభం
ప్రమాదకరంగా కరెంట్‌ తీగలు

ప్రమాదకరంగా కరెంట్‌ తీగలు

రాజాపూర్‌, డిసెంబరు 26: పంట పొలాల్లో విద్యుత్‌ వైర్లు తగిలి రైతుల ప్రాణాలు పోతున్నా మండల విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మల్లేపల్లి గ్రామ పంచాయతీ సోమ్లా తండా వాసులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాల్లో విద్యుత్‌ వైర్లకు స్తంభాలు ఏర్పాటు చేయాలని డీడీలు కట్టినా ఇప్ప టి వరకు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిధిలోని లైన్‌మెన్‌కు సమాచా రం అందిస్తే కట్టెలతో స్తంభాల ఏర్పాటు చేశారు కదా ఇక్కడ స్తంభం అవసరం లేదని అక్కడి నుం చి వెళ్లిపోయినట్లు రైతులు పేర్కొన్నారు. ఆరు నెల ల క్రితం పక్క తండా అయిన మెత్కులకుంట తం డా గ్రామ పంచాయతీ వాచ్య తండాలో అదే విద్యు త్‌ వైర్లు తగిలి రైతు మృతి చెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఇప్ప టికైనా విద్యుత్‌ అధికారులు రైతుల ప్రాణలతో చెల గాటమాడకుండా వెంటనే విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి రైతుల ప్రాణాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-12-27T03:33:29+05:30 IST