తగ్గని క్రైం

ABN , First Publish Date - 2020-12-28T03:35:50+05:30 IST

నేరాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, వాటిని పోలీసులు అదుపు చేయలేకపోతున్నా రు.

తగ్గని క్రైం
శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌ హౌస్‌లో చెలరేగిన మంటలను ఆర్పుతున్న సిబ్బంది (ఫైల్‌)

- 2020లో నియంత్రణలోకి రాని నేరాలు 

- కరోనా లాక్‌డౌన్‌లోనూ దొంగతనాలు

- గతేడాదికన్నా పెరిగిన రోడ్డు ప్రమాదాలు 

- విషాదం నింపిన శ్రీశైలం పవర్‌ హౌస్‌ దుర్ఘటన

- ప్రభుత్వ శాఖలను వెంటాడిన అవినీతి మరక 

- కొవిడ్‌-19 సేవల్లో పోలీసులకు ప్రశంస


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 27 : నేరాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, వాటిని పోలీసులు అదుపు చేయలేకపోతున్నా రు. శాంతిభద్రతల పరిరక్షణకు కొత్త కొత్త చ ట్టాలను తీసుకొస్తున్నా, ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించ డం లేదు. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, దోపిడీ లు, మోసాలు, అవినీతి అక్రమాల మరకలను ఈ ఏడాది మూటగట్టుకున్నది. కరోనా వ్యాప్తితో సుదీర్థ కాలం లాక్‌డౌన్‌ ఉన్నా, క్రైం రేట్‌ మాత్రం గతేడాదికన్నా, ఈ ఏడాది పెరిగిం దని చెప్పాల్సి వస్తోంది. 


రోడ్లు రక్తసిక్తం

ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై పెద్దగా వాహనాలు తిరగలేదు. అయినా, సగటున ప్రమాదాల సంఖ్య తగ్గలేదు. ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు వెయ్యి మంది మృతి చెందారు. 2,100 మంది క్షతగాత్రులుగా మిగిలా రు. ఇందులో ఒక్క పాలమూరు జిల్లాలోనే 240 మంది మృ త్యువాత పడగా, 380 మంది క్షతగాత్రులయ్యారు. మార్చి 11న జడ్చర్ల వద్ద లారీ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు దుర్మ రణం చెందారు. ఏప్రిల్‌ 30న పెద్దకొత్తపల్లి మండలంలో బైక్‌ పై వెళుతున్న తండ్రీకొడుకులు సాత్లావత్‌ నాయక్‌, రమేశ్‌నా యక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.


లాక్‌డౌన్‌లో సేవలు

ఈ ఏడాది ఆరంభంలోనే కరోనా వైరస్‌ విజృంభించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలో పోలీసులు ముందుండి కరోనా కట్టడిలో పాల్పంచుకున్నారు. బాధితులను ఆసుపత్రులకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించడంలో కీలక పా త్ర పోషించారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు వంద మంది పోలీసులు వైరస్‌ బారిన పడ్డారు.


జడలు విప్పిన అవినీతి

ప్రభుత్వ శాఖల్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ ఆగస్టులో పట్టణానికి చెందిన క్లోరోకెమికల్‌ పరిశ్రమ అనుమతి విషయంలో రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటూ ప ట్టుబడ్డారు. అతని ఆస్తులపై తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు రూ.2.65 కోట్ల ఆస్తులను గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యాపారి లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసేందుకు ఆహార కల్తీ నియంత్రణ శా ఖ కార్యాలయంలో అటెండర్‌ మహ్మద్‌ వాజిద్‌ రూ.4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట డి ప్యూటీ తహసీల్దార్‌ జయలక్ష్మి భూమి మ్యూటేషన్‌  కోసం రూ.10 లక్ష లకు అంగీకారం చేసుకొని, రూ.లక్ష తీసుకుంటూ ఏసీబికి చిక్కింది.


చోరీలతో ఉక్కిరిబిక్కిరి

ఈ ఏడాది దొంగతనాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సెస్టెంబరులో జడ్చర్లలో హర్యానాకు చెందిన ఏడుగురు ఏటీఎంను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి, రూ.40 లక్షల నగదు కొల్లగొట్టారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు, రూ.12 లక్షలు రికవరీ చేశారు. ఆగస్టు లో హన్వాడకు చెందిన చందూ అనే వ్యక్తి ఓ కమిషనర్‌ వాయిస్‌ను అనుకరించి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసును ఛేదించిన పోలీసు లు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నెల మిడ్జిల్‌లో ఓ పెళ్లింట్లో దొం గలు పడి వంద తులాల బంగారం, రూ.7 లక్షల నగదును చోరీ చే శారు. ఆత్మకూర్‌, మహబూబ్‌నగర్‌లోకి గోకుల్‌ వైన్స్‌లలో నిర్వాహకు లే కన్నం వేసి పెద్దఎత్తున మద్యాన్ని లూఠీ చేశారు.


విషాదం నింపిన పవర్‌ హౌస్‌ ఘటన

ఆగస్టు 21న శ్రీశైలం పాతాళగంగ జలవిద్యుత్‌ కేంద్రంలో మంటలు వ్యాపించి తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి మంటలు వ్యాపించడంతో అందులో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు దట్టమైన పొగకు ఊపిరాడక చనిపోయారు. పవర్‌హౌస్‌ కాలిపోవడంతో విద్యుత్‌ ఉత్సత్తి నిలిచిపోయింది.

Updated Date - 2020-12-28T03:35:50+05:30 IST