పట్టించిన ఫింగర్‌ ప్రింట్‌

ABN , First Publish Date - 2020-12-31T03:34:08+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కొని పోలీసుల దొంగల ఆట కట్టించారు.

పట్టించిన ఫింగర్‌ ప్రింట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

- పెళ్లింట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు 

- వివరాలను వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30 : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కొని పోలీసుల దొంగల ఆట కట్టించారు. ఈ నెల 18న మహబూబ్‌నగర్‌ జి ల్లా మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో దొం గతనం జరిగింది. ఈ కేసును ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చే శారు. స్పెషల్‌ టీమ్‌లతో పాటు కోర్‌ టీమ్‌, ఫింగర్‌ ప్రింట్‌ బృందాలను రం గంలోకి దించారు. నేరం జరిగిన తీరును బట్టి పాత నేరస్తులను గుర్తించి ద ర్యాప్తు చేశారు. అయితే, ఘటనా స్థలంలో అంగడి సురేశ్‌ అనే పాత నేరస్తుడి వేలి ముద్రలు మ్యాచ్‌ కావడంతో అతన్ని పట్టుకుని విచారిస్తే అసలు విష యం బటపడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మహ బూబ్‌నగర్‌లోని పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు.

మహబూబాబాద్‌ జిల్లా నెలల్లికోడూరుకు చెందిన అంగడి సురేశ్‌, దాసరి మురళీకృష్ణ, బొల్లంపల్లి పీరయ్య, ఖమ్మం జిల్లా టేకులపల్లికి చెందిన బిజిలి మల్లేష్‌ల ముఠా ఈ దొంగతనానికి పాల్పడింది. వీరంతా రంగారెడ్డి జిల్లా హ యత్‌నగర్‌ మండలం తోర్రూర్‌లోని రాజీవ్‌ గృహకల్పలో ఒకే బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న తొర్రూర్‌ నుంచి ఆటో తీసుకొని బోయిన్‌పల్లికి వ చ్చారు. బీరయ్య మాత్రం ఆటోను కల్వకుర్తి ప్రాంతంలో మందే అనుకున్న ఒ క ప్రాంతానికి తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి నిందితులు బోయిన్‌పల్లి గ్రా మంలో ఓ ఇంట్లో దొంగతనం చేయగా, రూ.18 వేల నగదు దొరికింది. పక్కనే ఇంద్రారెడ్డికి చెందిన పెద్ద ఇల్లు కనిపించడంతో, ఆ ఇంట్లో దొంగతనం చేసేం దుకు వెళ్లారు. బయట వరికోత యంత్రం టూల్‌బాక్స్‌లో ఓ స్ర్కూ డ్రైవర్‌ను తీసుకొని, ఇంటి వెనక వైపున ఉన్న కిచెన్‌ డోర్‌ పక్కన ఉన్న కిటికీని విప్పి ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి అక్కడే ఉన్న అల్మారా తాళం చె వితో తెరిచారు. లోపల ఉన్న లాకర్‌ తాళాన్ని స్ర్కూ డ్రైవర్‌తో తొలగించి, అం దులో ఉన్న బంగారునగలు, నగదు అపహరించారు. అనంతరం మిడ్జిల్‌లో ఒక పల్సర్‌ వాహనాన్ని దొంగిలించి దానిపైనే వెళ్లిపోయారు. తలకొండపల్లిలో మరో పల్సర్‌ వాహనాన్ని దొంగిలించారు. దొంగిలించిన నగలను మహబూబా బాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. నిందితులు అంగడి సురేశ్‌, దాసరి మురళీకృష్ణలపై ఇదివరకు 30-40 దొంగతనం కేసులు ఉన్నాయి. వీరిపై పీడీ చట్టం కింద కేసులు కూడా ఉన్నా యి. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 

కాగా, కేసును ఛేదించిన జడ్చర్ల సీఐ శివకుమార్‌, మిడ్జిల్‌ ఎస్‌ఐ సురేశ్‌, ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌, కానిస్టేబుళ్లు ఎం.శ్రీకాంత్‌, ఎండీ నిరంజన్‌, ఎం.వెంకటేశ్‌, పి.శ్రీనివాసులు, పర్వతచారి, రవీంద్రనాథ్‌, ర త్నం, ఐటీ కోర్‌ టీం రియాజ్‌, సీసీఎస్‌ పోలీసులు శ్రీను, రంజిత్‌, టూటౌన్‌ కా నిస్టేబుల్‌ మురళిలను ఎస్పీ అభినందించారు. వారికి నగదుతో పాటు రి వార్డులను అందజేశారు.

Updated Date - 2020-12-31T03:34:08+05:30 IST