వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T03:05:34+05:30 IST
రైతాంగాన్ని నాశనం చేసే విధంగా తీసుకొచ్చిన వ్యవసాయ చ ట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
తెలకపల్లి, డిసెంబరు 1: రైతాంగాన్ని నాశనం చేసే విధంగా తీసుకొచ్చిన వ్యవసాయ చ ట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని యోగా బిల్డింగ్‌లో మంగళవారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తి రంగాలకు ఇచ్చే రాయితీని వ్యవసాయ రంగానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3న సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తామన్నారు. నాయకులు పర్వతాలు, ఆర్.శ్రీనివాస్, దేశనాయక్, లక్ష్మణ్, ఆంజనేయులు, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.