దిగజారుడు వ్యాఖ్యలు తగవు

ABN , First Publish Date - 2020-12-11T04:08:09+05:30 IST

దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌వి జయవంతమైనా బీజేపీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదని సీపీఎం జిల్లా కా ర్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు.

దిగజారుడు వ్యాఖ్యలు తగవు
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌

 సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌  

వీపనగండ్ల, డిసెంబరు 10: దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌వి జయవంతమైనా బీజేపీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదని సీపీఎం జిల్లా  కా ర్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలే కర్లతో మాట్లాడారు. రైతులు బంద్‌లో పాల్గొనలేదని, బ్రోకర్లు, దళారులు పాల్గొన్నారని బీజేపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో  రైతుల తరపున పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటనను స్వాగతిస్తామన్నారు.  కేంద్రంలో 14 రోజులుగా రైతులు నిరసనలు తెలుపు తున్నా స్పందించకుండా వారిపై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.   సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి డి.బాల్‌రెడ్డి,నాయకులు మురళి, వెంకట స్వామి, వెంకటేశ్వర్‌గౌడ్‌, ప్రవీణ్‌,రామన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-11T04:08:09+05:30 IST