అతని కొడుకు, కోడలికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-04-01T17:53:24+05:30 IST
ఢిల్లీలో జరిగిన ఓ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన వడ్డేపల్లి మండల కేంద్రానికి చెందిన...

అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారు?
వివరాలు సేకరిస్తున్న అధికారులు
వడ్డేపల్లిలో కరోనాతో వృద్ధుడి మృతితో కలకలం
అతని కొడుకు, కోడలికి పాజిటివ్
గాంధీ ఆస్పత్రిలో చేరిక
వారి ఇద్దరు పిల్లలు క్వారంటైన్లో..
గద్వాల (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన ఓ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన వడ్డేపల్లి మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు(65) కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయమై పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 30 మంది పాల్గొన్నారని ఒక అంచనాకు రాగా, వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారని, మిగతా వారి వివరాలను సేకరిస్తున్నారని సమాచారం.
కొడుకు, కోడలికి పాజిటివ్: కరోనాతో సదరు వృద్ధుడు గద్వాల ఆస్పత్రిలో సోమవారం మృతి చెందగా, అతని కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొడుకు, కోడలుకు కరోనా పాజిటివ్ రావడంతో గాంధీలో చేర్చుకున్నారని, ఇద్దరు పిల్లలను క్వారంటైన్లో ఉంచారని గద్వాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
అధైర్య పడొద్దు: కరోనా వైరస్‌తో ఒకరు మృతి చెందారని అధైర్య పడొద్దని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితోపాటు వారితో సన్నిహితంగా ఉన్న వారు క్వారంటైన్ కేంద్రంలో చేరాలని చెప్పారు.