ఆగని కొవిడ్‌ వ్యాప్తి.. ఉమ్మడి పాలమూరులో కొత్తగా 89 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-28T20:52:48+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సోమవారం కొత్తగా 89 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు.

ఆగని కొవిడ్‌ వ్యాప్తి.. ఉమ్మడి పాలమూరులో కొత్తగా 89 కేసులు నమోదు

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడలో ఒకరి మృతి


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సోమవారం కొత్తగా 89 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం కొత్తగా 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 21 కేసులో జిల్లాకేంద్రంలోనే నమోదు కావడం గమనార్హం. పట్టణ పరిధిలోని మర్లులో ఒకటి, రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ప్రాంతంలో ఒకటి, టీడీ గుట్టలో ఒకటి, నలంద ఆటోస్టాండు ఒకటి, అబ్దుల్‌ ఖాదర్‌ కాలనీలో ఒకటి, ఏనుగొండలోని చైతన్య నగర్‌ కాలనీలో రెండు కేసులు నమోదయ్యాయి. సద్దలగుండులో ఒకే ఇంట్లో ముగ్గురికి, న్యూగంజ్‌లో ఇద్దరికి, బాలాజీనగర్‌లో ఒక్కరికి, న్యూమోతీనగర్‌లో ఒక్కరికి, ఎస్వీఎస్‌ ఆసుపత్రి ప్రాంతంలో ఒక్కరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కుమ్మరివాడలో ఒకటి, కలెక్టర్‌ బంగ్లా హనుమాన్‌ నగర్‌ ప్రాంతంలో ఒకటి, ఎదిరలో ఒకటి, శివశక్తినగర్‌లో ఒకటి, టీచర్స్‌ కాలనీలో ఒకటి, మహబూబ్‌నగర్‌ మండల పరిదిలోని దివిటిపల్లిలో ఒక  పాజిటివ్‌ కేసులు వచ్చాయి. జడ్చర్లలోని కావేరమ్మపేటలో ఒకటి, గాంధీనగర్‌లో ఒకటి, హౌసింగ్‌ బోర్డులో ఒకటి ఉన్నాయి. దీంతో పాటు అడ్డాకుల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఒకటి ,బూత్పూర్‌ మండలం కప్పెట గ్రామంలో ఒకటి, హన్వాడలో ఒకరికి, మండలంలోని గుండ్యాల్‌ కిష్టంపల్లిలో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా హన్వాడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందాడు.


గద్వాల జిల్లా కేంద్రంలోని కోవిడ్‌ ల్యాబ్‌లో సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలలో 10 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు తెలిసింది. ర్యాపిడ్‌ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో 25 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. అందులో గద్వాల పట్టణంలోనే 22 మంది బాధితులున్నారు. పట్టణంలోని రెండవ రైల్వేగేట్‌, చింతలపేట, నల్లకుంట, గంజిపేట, లింగంబాగ్‌కాలనీ, భీంనగర్‌ కాలనీలతో పాటు గద్వాల మండలం మేలచెర్వు, మల్దకల్‌ మండలం ఎల్కూరు, అమరవాయి, ధరూర్‌ మండలం బురెడ్డిపల్లి, మార్లబీడు, పెద్దధన్వాడ, అమరచింతకు చెందిన వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులోనే ఒక్క కల్వకుర్తి పట్టణంలోని ఐదుగురికి కరోనా సోకింది. 


వనపర్తి జిల్లాలో సోమవారం మూడు కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో కొత్తకోట మండలం తిరుమలాయపల్లిలో ఒకరికి, వనపర్తి పట్టణంలో ఇద్దరికి కరోనా సోకింది. 


నారాయణపేట జిల్లాలో సోమవారం 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని పళ్ల ఏరియాలో ఒకరికి, శ్రీనగర్‌కాలనీలో మరొకరికి, సుభాష్‌రోడ్‌, అశోక్‌నగర్‌, సాయికాలనీ, హజిఖాన్‌పేట్‌లలో ఒక్కొక్కరు చొప్పున కొవిద్‌ బారిన పడ్డారు. మద్దూర్‌లో ముగ్గురికి, నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. కోస్గీ పట్టణంలోని సాయినగర్‌ కాలనీలో వృద్ధుడికి, బోగారంలో ఒక యువతికి, హన్‌మాన్‌ పల్లిలో ఒకే ఒకే కుటుంబానికి చెందిన మహిళకు, బాలికకు కరోనా సోకింది.

Updated Date - 2020-07-28T20:52:48+05:30 IST