కరోనా తంట

ABN , First Publish Date - 2020-08-12T10:28:47+05:30 IST

ప్రభుత్వం కరోనా క్వారంటైన్‌ కేం ద్రాలను ఎత్తివేసింది. పాజిటివ్‌ బాధితులంతా ఇళ్లలోనే హోం క్వారంటైన్‌లో

కరోనా తంట

క్వారంటైన్‌ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు

ళ్లల్లో సదుపాయాలు లేక

తరగతి గదుల్లోనే ఉంటున్న బాధితులు

మూడు రోజుల్లో రానున్న పంద్రాగస్టు వేడుకలు

నిర్వహణపై ఉపాధ్యాయుల మల్లగుల్లాలు  

శానిటైజేషన్‌ చేయాలన్నా స్పందించని పంచాయతీ పాలక వర్గాలు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వం కరోనా క్వారంటైన్‌ కేం ద్రాలను ఎత్తివేసింది. పాజిటివ్‌ బాధితులంతా ఇళ్లలోనే హోం క్వారంటైన్‌లో ఉండాలని సూ చించింది. ఈ నేపథ్యంలో ఇళ్లల్లో క్వారంటైన్‌కు సదుపాయాల్లేని వారంతా ప్రభుత్వ పాఠశాల ల్లో ఉంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సీసీకుంట, గండీడ్‌, జడ్చర్ల, బాలానగర్‌, మిడ్జి ల్‌, హన్వాడ, నవాబుపేట మండలాల్లో ఎక్కు వగా ఈ పరిస్థితే ఉంది. ఇళ్లలో అందరూ కలి సి ఉండాల్సి ఉండడం, ప్రత్యేకంగా గదుల్లేక పోవడం వంటి సమస్యలతో ఆయా గ్రామాల సర్పంచులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ ప్రాంతాల్లోని రోగులను సమీపంలో ఉన్న పాఠశాలల భవనాల్లో ఉండేందుకు అనుమతిం చింది. బడులు లేకపోవడంతో ఉపాధ్యాయు లు, తల్లిదండ్రుల నుంచి కూడా ఎలాంటి వ్య తిరేకత రాలేదు. అయితే, మరో మూడు రో జుల్లో పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి.


ఇప్పటికే ఈ వేడుకలకు పిల్లలను రానివ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. స్కూళ్లన్నిం టినీ తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయించాలని సూచించినా, పంచాయతీ పాలక వర్గాలు, సి బ్బంది మాత్రం స్పందించడం లేదు. నాలుగు నెలలుగా స్కూళ్లు మూతపడడంతో పాటు, కరోనా నేపథ్యంలో కొన్ని పాఠశాలల భవనాల్లో పాజిటివ్‌ బాధితులు క్వారంటైన్‌లో ఉన్నారు. మరికొన్ని స్కూళ్లను క్వారంటైన్‌గా వినియోగిం చుకొని వెళ్లిపోయారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం ఈ బడున్నిటిని తప్పనిసరిగా శాని టైజ్‌  చేశాకే మళ్లీ వినియోగించాల్సి ఉంటుం ది. పంద్రాగస్టు రోజు టీచర్లంతా జెండా వం దనాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పంచాయతీ లతో బడులన్నిటినీ శానిటైజ్‌ చేయుంచేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Updated Date - 2020-08-12T10:28:47+05:30 IST