సమన్వయంతోనే అభివృద్ధి : ఎంపీ రాములు

ABN , First Publish Date - 2020-09-06T09:50:48+05:30 IST

జిల్లాలో కలిగి ఉన్న వనరులతో అధికారులు, ప్ర జాప్రతినిధులు కలిసి అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు సాగాలని జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్ష కమిటీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి. రాములు అన్నారు...

సమన్వయంతోనే అభివృద్ధి  : ఎంపీ రాములు

గద్వాల, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కలిగి ఉన్న వనరులతో అధికారులు, ప్ర జాప్రతినిధులు కలిసి అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు సాగాలని జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్ష కమిటీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి. రాములు అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై హరిత హోటల్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం దిశ అధ్యక్షుడు రాములు అధ్యక్షతన జరిగింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో జరుగుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై వివిధ డిపార్టుమెంట్‌ల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా డిజిటల్‌ పాఠాలు ప్రారంభమయ్యాయి. చాల మంది విద్యార్ధులకు అనేక రకాల సమస్యలతో వారి డిజిటల్‌ పాఠాలు వినే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో అభివృద్ది జరుగాలంటే.. అధికారులు ప్రజా ప్రతినిదులను కలుపుకోని ముందుకు సాగితే బాగుంటుందని ఎమ్మెల్యే బండ్ల అన్నారు. జిల్లాలో జ రుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకరావాలని అన్నారు.  ఏసీ శ్రీనివాసరెడ్డి, శ్రీహర్ష పాల్గొన్నారు. 


అధికారుల పనితీరుపై మండిపడిన ఎమ్మెల్యేలు

జిల్లా యంత్రాంగానికి ఎమ్మెల్యేలు అంటే చులకగా మారిందని, ఏ విష యం కూడా ఎమ్మెల్యేలకు చెప్పకుండా ముందుకు పోవడంపై  గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్‌ అబ్రహంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిత హోటల్‌లో  శనివారం దిశ సమీక్షా సమావేశంలో అ ధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రధానంగా గ్రామీణ ఉపాధి హమీ అధికారుల వేధింపులతో కింది స్థాయి సిబ్బంది పారిపోవాల్సిన దుస్థితి చోటు చేసుకుందని, గద్వాల ఆస్పత్రిలో కొవిడ్‌ రోగులకు వైద్యులు బయటకు చీ టీలు రాయడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. జిల్లాలో యువతకు ఉపాధి కల్పించాలని  చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి చోటుచేసుకుందన్నారు. రైతులకు పట్టాలు, పాసు పుస్త కాలివ్వడానికి రూ.లక్షల్లో ముడుపులు అడుగుతున్నారని, ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలన్నారు. అలంపూర్‌ నియోజక వర్గంలో ఎవరు ఏ రకమైన పనులు చేస్తున్నారనే విషయంపై ఎమ్మెల్యేగా నాకు సమాచారం ఇవ్వక పోవడంపై డాక్టర్‌ అబ్రహాం మండిపడ్డారు. నియోజక వర్గం నుంచి ఐదు ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కాని సీనరేజ్‌ నిధులు మండలాలకు ఇవ్వడం లేదన్నారు. అధికా రులు ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్లకుండ భవిష్యత్తు అనేక ఇబ్బందులు తలెత్తుతా యని ఇద్దరు ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.


పట్టణంలో అభివృద్ధి పనులను పూర్తి చేయండి

గద్వాల మునిసిపాలిటీలో సీఎం, కేటీఆర్‌తోపాటు 14,15 అర్థిక సంఘం నిధులతో పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్షను ఎంపీ రాములు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు.   పనులు నత్తనడకన జరుగుతున్నాయని, కాంట్రాక్టర్లను పురమాయించి ప నులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  గురువుల బాటలో నడిచే వారు అభివృద్ధి చెందుతున్నారని ఎంపీ రాములు అన్నారు. టీచర్స్‌డే సం దర్భంగా శనివారం డీఈవో కార్యాలయం ముందు ఉన్న రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


వ్యాధుల నివారణకు కృషి చేయాలి

గద్వాల క్రైం: వ్యాధుల నివారణకు వైద్యసిబ్బంది కృషి చేయాలని ఎంపీ రా ములు అన్నారు. పట్టణంలోని హరిత హోటల్‌లో శనివారం డెంగ్యూ, మలేరియా కరపత్రాలను విడుదల చేశారు. కలెక్టర్‌ శ్రుతి ఓఝా, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్యెల్యేలు బండ్ల, అబ్రహాం, డీఎంహెచ్‌వో తదితరులున్నారు.


ప్రైవేట్‌ టీచర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనా కాలానికి జీతాలు వచ్చేలా చూడాలని కోరుతూ జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రవేట్‌ టీచర్ల ఫోరమ్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో నిరసన వ్యక్తంచేశారు. వారు మాట్లాడుతూ ప్రైవేట్‌ టీచర్లకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, లాక్‌డౌన్‌ సమయంలో టీచర్లకు ఆరునెలల జీతాలను ప్రైవేట్‌ యాజమాన్యాలు ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ రాములుకు వినతిపత్రాన్ని సమర్పించారు.

Updated Date - 2020-09-06T09:50:48+05:30 IST