పర్యవేక్షణకు కంట్రోల్ రూం
ABN , First Publish Date - 2020-09-20T08:41:59+05:30 IST
కలెక్టరేట్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు...

కలెక్టరేట్(మహబూబ్‌నగర్), సెప్టెంబర్ 19: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎదు రయ్యే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చేందుకు కలెక్టరేట్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. సమాచారాన్ని కట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 08542-241165కు తెలుపాలని చెప్పారు. అన్ని స్థాయిల అధికారులు వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు తక్షణమే వెళ్లాల ని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, మండల, గ్రామ పంచాయతీ అధికారులంతా జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని సూ చించారు. అధికారులు కార్యాస్థలాల్లో ఉంటూ, వ ర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను పర్యవేక్షిం చాలని చెప్పారు. తన అనుమతి లేకుండా ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. పాత ఇండ్లను పరిశీలించి, పాడుబడిన ఇళ్లల్లో ఎవరైనా ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఎట్టి పరిస్థితిలో ఎవరూ చనిపోడానికి వీలు లేదన్నారు. కుంటలు, చెరువులు, రోడ్లను(రహదారులు) పరిశీలించి, ఏవైన దెబ్బతింటే నివేదికలు ఇవ్వాలని చెప్పారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల న్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని తెలిపారు నీటిపారుదల, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధి కారులు తప్పని సరిగా రహదారులతో పాటు కుం టలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను జాగ్రత్తగా గమని స్తూ ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబర్ 08542-241165కు తెలుపాలని చెప్పారు.
కోయిల్‌సాగర్‌ను సందర్శన
దేవరకద్ర, సెప్టెంబరు 19: జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ చెప్పా రు. కోయిల్‌సాగర్ సందర్శనకు అనుమ తిలేనం దున సందర్శకులు గమనించాలని తెలిపారు. శనివారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. శుక్ర వారం ప్రాజెక్టు 11 గేట్లు తెరువగా, శనివారం 3 గేట్ల ద్వారా నీటిని వదిలారు. గేట్లు తెరువడంతో జనాలు వస్తున్నారని, వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టులు, వాగుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.