ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినం

ABN , First Publish Date - 2020-12-29T03:53:28+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి బంగ్లా ఆవరణలో జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా కాంగ్రెస్‌  పార్టీ ఆవిర్భావ దినం
కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకల్లో‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు

గద్వాలక్రైం/ అయిజ, డిసెంబరు 28 : కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి బంగ్లా ఆవరణలో జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సేవలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. వసంతరావు, గంజిపేట శంకర్‌, మల్దకల్‌  నల్లారెడ్డి, ఉమాదేవి, నాయకులు జమాల్‌, పాష, పరుష, గోపాల్‌ ఉన్నారు. అయిజలో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి షేక్షావలి ఆచారి కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  దేవరాజు, తిప్పన్న, బస్వరాజ్‌, హన్మన్న, సాంబశివుడు, మధు, రమేష్‌, లాల్‌గౌడు, శాలీఫైల్‌మాన్‌, దేవన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T03:53:28+05:30 IST