ప్రజా సంక్షేమమమే కాంగ్రెస్‌ పార్టీ పరమావధి

ABN , First Publish Date - 2020-12-29T04:02:09+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.

ప్రజా సంక్షేమమమే కాంగ్రెస్‌ పార్టీ పరమావధి
కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల/ అడ్డాకల్‌ /దేవరకద్ర /గండీడ్‌/ చిన్నచింతకుంట /నవాబ్‌పేట /మిడ్జిల్‌/ రాజాపూర్‌, డిసెంబరు 28: కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు.  కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యాలయంలో జెండాను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో కాంగ్రెస్‌ మహా నీయులు తమ ప్రాణాలను, ఆస్తులను కోల్పోయార ని, వారి ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయా ల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయ కులు ఎన్‌పీ వెంకటేశ్‌, నయీ మొద్దీన్‌, చంద్రకు మార్‌  గౌడ్‌, సీజే బెనహర్‌, లక్ష్మణ్‌ యాదవ్‌, సాయి బాబా, రాములు యాదవ్‌ పాల్గొన్నారు. 

- జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో పార్టీ పతాకాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు మినాజ్‌ ఎగురవేశారు. స్వాతంత్య్రం తేవడంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిత్యానందం, బుర్లవెంకటయ్య, టివిగౌడ్‌, బెన్యూ, ఖాజాపాష, రఘు, వంశీ, హుమాయున్‌ పాల్గొన్నారు. 

- అడ్డాకుల మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌ కూడలిలో పార్టీ జెండాను టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్‌రెడ్డి ఎగువేశారు. కార్యక్ర మంలో జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి విజయమోహన్‌ రెడ్డి, నియోజకవర్గ మైనార్టీసెల్‌ అధ్యక్షుడు షఫిహ మ్మద్‌, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాల్‌ రాజ్‌, ఉప సర్పంచుల సంఘం మండల అఽధ్యక్షుడు జి. శ్రీనివాస్‌రెడ్డి, దశరథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

- దేవరకద్ర మండల కేంద్రంలోని సోమవారం కాంగ్రెస్‌ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీ సీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ జెండాను ఎగర వేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుర్వరాం దాస్‌ ఓబీసీ కన్వీనర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

- గండీడ్‌ మండలంలో నంచర్లగేట్‌ దగ్గర కాం గ్రెస్‌ పార్టీ జెండాను ఎగుర వేసి సంబురాలు జరు పుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఇ.రా ములు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేఎం. నారాయణ నాయకులు ముకుందం, కృష్ణయ్య, చంద్రయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.

-  చిన్నచింతకుంట మండల కేంద్రంలోని కాంగ్రె స్‌ పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌ కుమార్‌గౌడ్‌, పార్టీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీసీ శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ వేణు గోపాల్‌, ఎంపీటీసీ శివరాజ్‌, నాయకులు సంతోష్‌ రెడ్డి, మంగా శ్రీనివాసులు, రషీద్‌ పాల్గొన్నారు.

- నవాబ్‌పేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్‌ పార్టీ 136వ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించా రు. కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్ర మంలో డీసీసీ ఉపాధ్యక్షుడు రంగారావు, జహీర్‌ అక్తర్‌, మాజీ ఎంపీపీ కిషన్‌జీ, బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

- మిడ్జిల్‌ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు పర్వతాలు, బాలస్వామి, కృష్ణ, శివ, రాముగౌడ్‌, శంకర్‌, శేఖర్‌, అంజి పాల్గొన్నారు.

- రాజాపూర్‌ మండల కేంద్రంలోని స్థానిక ముఖ్య కూడలిలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేశారు. కార్య క్రమంలో లింగం, గోపాల్‌రెడ్డి, రమణ, రమేష్‌, రమే ష్‌ రెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి, వెంకటయ్య, నసిర్‌ బైగ్‌, యాదయ్య, కృష్ణయ్య, కృష్ణ, చంద్రకాంత్‌ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:02:09+05:30 IST