కాంగ్రెస్‌ పార్టీలో మాదిగలకు రక్షణ లేదు

ABN , First Publish Date - 2020-12-31T03:08:59+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో మాది గలకు విలువ లేదు, రక్షణ లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్‌మాదిగ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో మాదిగలకు రక్షణ లేదు
జిల్లా కేంద్రంలో వంశీకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సతీష్‌మాదిగ వర్గీయులు

- టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్‌మాదిగ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 30: కాంగ్రెస్‌ పార్టీలో మాది గలకు విలువ లేదు, రక్షణ లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్‌మాదిగ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనను కొట్టించిన డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను వెంటనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశా రు. డీఎస్‌ మాస్‌ సంస్థ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు ప రిధిలోని 1000గ్రామాల నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు, మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. అలాంటిది మాజీ ఎమ్మెల్యే అచ్చంపేటలో తన సేవా కా ర్యక్రమాలను అడ్డుకుంటూ తన వర్గీయులతో దాడి చేయించారని పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజా దరణ చూసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారనే భయంతోనే  తనపై దాడి చేయించారని ఆ ప్రకటనలో ఆరోపించారు.   అదికూ డా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే అచ్చంపేటలో దాడి చేయిం చారన్నారు. ఈ విషయమై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.   


వంశీకృష్ణ దిష్టిబొమ్మ దహనం

మంగళవారం అచ్చంపేటలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతి నిధి దేవని సతీష్‌ మాదిగపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో డీఎస్‌ మాస్‌ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దిష్ఠిబొమ్మను దహనం చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం వెంటనే స్పందిం చి వంశీకృష్ణను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాకుం డా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సతీష్‌మా దిగ వర్గీయులు లేట్ల వెంకట్‌, మిద్దె మల్లేష్‌, చిన్నగళ్ల జైపాల్‌, మ్యాతరి సత్యం, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. 

 వంశీకృష్ణను సస్పెండ్‌ చేయాలి

కొల్లాపూర్‌ రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణను సస్పెండ్‌ చేయాలని డీమాస్‌ నాయకులు, సతీష్‌ మాదిగ అనుచరవర్గం డిమాండ్‌ చేసింది. బుధవారం కొ ల్లాపూర్‌ పట్టణంలో అంబేడ్కర్‌ సర్కిల్‌లో వంశీకృష్ణ దిష్టి బొమ్మను దహనం చేశారు.  వెంటనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంశీకృ ష్ణను సస్పెండ్‌ చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని డీమాస్‌ నాయకుడు కుమార్‌ మాదిగ హెచ్చరించా రు. రమేష్‌, వెంకటేష్‌, నాగరాజు, నరసింహ తదితరులు ఉన్నారు. Updated Date - 2020-12-31T03:08:59+05:30 IST