డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆందోళన
ABN , First Publish Date - 2020-11-03T10:24:03+05:30 IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ఆందోళన చేశారు. అర్హులైన అందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 523 సర్వే నంబర్‌లో
మహబూబ్‌నగర్ టౌన్, నవంబరు 2: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ఆందోళన చేశారు. అర్హులైన అందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 523 సర్వే నంబర్‌లో స్థలాలు ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని అధికారులు గతంలో హామీ ఇచ్చారని అన్నారు. రశీదు ఇచ్చిన వారికి ఇళ్లు ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ పార్థసారథి వారి వద్దకు వచ్చి మాట్లాడుతూ, అర్హులకు త్వరలో ఇళ్లు ఇస్తామని చెప్పారు. కొంత జాప్యం జరిగినా, ఇళ్లు ఇస్తామన్నారు. బాధితులు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఇస్తామని చెప్పారు.