-
-
Home » Telangana » Mahbubnagar » Commencement of a bargain buying center
-
వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2020-04-07T10:14:14+05:30 IST
బాదేపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో పత్తి మార్కెట్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్ ఏప్రిల్ 6 : బాదేపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో పత్తి మార్కెట్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాదేపల్లి పత్తి మార్కెట్‌లో బాదేపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో పెద్దఆదిరాల, కోడ్గల్, నసరుల్లాబాద్, పోలేపల్లి కేంద్రాలలో ఐకేపీ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుల వద్దకు వెళ్లి వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గ్రేడ్-1 రకానికి క్వింటాలుకు రూ.1835లు, గ్రేడ్-2 రకానికి క్వింటాలుకు రూ.1815 ల ధర కల్పించనున్నట్లు, అలాగే మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.1706 ల ధర కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మిశివకుమార్, ఎంపీపీ లక్ష్మీశంకర్‌నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్‌యాదయ్య, బాదేపల్లి మార్కెట్ చైర్మన్ పిట్టలమురళీ, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ కొంగళిజంగయ్య, ఏడీఏ ఆంజనేయులు, ఏఓ రాంపాల్, ఐకేపీ ఏపీఎం మాల్యానాయక్, బాదేపల్లి పీఏసీఎస్ సీఈఓ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మిడ్జిల్ మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం ఆవరణలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ శశిరేఖబాలు, ఎంపీపీ కాంతమ్మబాలస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అల్వాల్‌రెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, పాండు, భాస్కర్, తదితరులున్నారు.