-
-
Home » Telangana » Mahbubnagar » collector meeting with bankers
-
వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-31T03:21:50+05:30 IST
వీధి ప్యాపారులకు బ్యాంకు రుణాలను వెంటనే అందించాలని కలెక్టర్ శ్రుతి ఓఝా బ్యాంకర్లను అదేశించారు

- బ్యాంకర్లను ఆదేశించిన కలెక్టర్ శ్రుతి ఓఝా
గద్వాల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వీధి ప్యాపారులకు బ్యాంకు రుణాలను వెంటనే అందించాలని కలెక్టర్ శ్రుతి ఓఝా బ్యాంకర్లను అదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు, మత్య్సకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్‌తో పాటు ఇతర శాఖల పరిధిలో సంక్షేమ రుణాలు అందించాలని అదేశించారు. జనవరి 10లోపు అన్ని రుణాలను మంజూరు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఎల్‌డీఎం రవీంద్రకుమార్, డీఆర్‌డీఓ ఉమాదేవి, మేనేజర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.