-
-
Home » Telangana » Mahbubnagar » collector meeting
-
భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్లాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-28T03:33:11+05:30 IST
గ్రామాలు అభివృద్ధి జరగాలంటే భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ హరిచందన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

నారాయణపేట టౌన్, నవంబరు 27 : గ్రామాలు అభివృద్ధి జరగాలంటే భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ హరిచందన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. మిషన్ అంత్యోదయ సర్వే దరఖాస్తులు, మహిళా యోజన వికాస్, ఈ గ్రామ స్వరాజ్ దరఖాస్తులకు సంబంధించి ప్రణాళిక రూపొందించడంపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టాలి, గ్రామం ఎలా ఉండాలి, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి తదితర పనులపై పూర్తి అవగాహన కల్గి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందే కాకుండా స్వతహాగా ఆలోచించి ఏదో ఓ ఆశయంతో ముందుకెళ్లి మీ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామ అభివృద్ధికిప్రణాళిక తయారు చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ సమాచారాన్ని సేకరించి ప్రాపర్టి అసెస్‌మెంట్ బాగా చేశారని భవిష్యత్తులో ప్లానింగ్ ప్రకారం చేయాలని సూచించారు. మొత్తం 29 శాఖలకు సంబందించిన సమాచారాన్ని ప్లానింగ్ ప్రకారం డేటా సేకరించాలన్నారు. సమావేశంలో డీపీఓ మురళి, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు పాల్గొన్నారు.
దుప్పట్ల పంపిణీ : అర్బన్ షెల్టర్‌లో తల దాచుకుంటున్న 12 మందికిశుక్రవారం జిల్లా కలెక్టర్ హరిచందన దుప్పట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ఐసీడీఎస్ జయపాల్‌రెడ్డి ఉన్నారు.