రైతు బంధు నిధులు విడుదల: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-29T04:03:25+05:30 IST

రైతు బంధు పథకం కింద యాసంగి లో జిల్లాలో 1,94,457 మంది రైతులకు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు.

రైతు బంధు నిధులు విడుదల: కలెక్టర్‌
ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

మహబూబ్‌నగర్‌, కలెక్టరేట్‌ డిసెంబరు 28: రైతు బంధు పథకం కింద యాసంగి లో జిల్లాలో 1,94,457 మంది రైతులకు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎకరాకు రూ.5 వేల చొప్పున విడుదల చేసిందన్నారు. ఈ సోమవారం నుంచే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. రైతు బంధుకు సంబం ధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08542-241165కు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, వ్యవసాయ అధికారి సుచరిత, ఎల్‌డీఎం నాగరాజు పాల్గొన్నారు.

- మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. అలాగే కలెక్టర్‌ తన సమా వేశపు హాలు నుంచి వాట్సాప్‌ వీడియోకాల్‌ ద్వారా ప్రజల నుంచి 21 ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ వెంకట్రమణ, మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:03:25+05:30 IST