సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-30T03:13:53+05:30 IST
పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్ చెక్కును మంగళవారం లబ్ధిదారులకు అందించారు
కొత్తకోట, డిసెంబరు29: పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్ చెక్కును మంగళవారం లబ్ధిదారులకు అందించారు. కొత్తకోట, మద నాపురం మండలాలకు చెందిన 34మందిని వీటిని పంపిణీ చేశారు. వామన్‌గౌడ్, గుంత మౌ నిక, సుకేశిని, ఆకుల శ్రీనివాసులు, చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. జాతీయస్థాయి ఓపెన్ కరాటే పోటీలో ప్రతిభ కనబర్చి బంగారు, వెండిపతకాలు సాధించిన గాంధీ, సహస్ర, మంజునాథ్, చందు, జయ సింహ, కైసర్‌తో పాటు శిక్షణ ఇచ్చిన గాడ్స్‌ఆన్ వారియర్ కరాటే అకాడమీ అధ్యక్షుడు మాస్టర్ అబ్దుల్ నబీని ఎమ్మెల్యే అభినందించారు.