చుక్కా రామయ్యను కలిసిన దేవేంద్రాచారి

ABN , First Publish Date - 2020-12-19T03:11:27+05:30 IST

ప్రముఖ విద్యావేత్త చుక్కా రా మయ్యను జిల్లా కేంద్రానికి చెందిన విజువల్‌ విద్యా రూపకర్త బసవోజు దేవేంద్రాచారి కలిశారు.

చుక్కా రామయ్యను కలిసిన దేవేంద్రాచారి
చుక్కా రామయ్యకు తన విజువల్‌ విద్యా నమూనాలకు వివరిస్తున్న దేవేంద్రాచారి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 18: ప్రముఖ విద్యావేత్త చుక్కా రా మయ్యను జిల్లా కేంద్రానికి చెందిన విజువల్‌ విద్యా రూపకర్త బసవోజు దేవేంద్రాచారి కలిశారు. శుక్రవారం హైదరాబాదులోని ఆయన నివాసం లో రామయ్యను కలిసిన దేవేంద్రా చారి తాను రూపొందించిన విజువ ల్‌ విద్యా నమూనాలను వివరించా రు. ఈ సందర్భంగా దేవేంద్రాచారి మాట్లాడుతూ విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు తాను రూపొందించిన కొత్త పుస్తకాల నమూనాకు రామయ్య పరిశీలించి ప్రశంసించారని తెలిపారు. తాను రూపొందించిన విజువల్‌ విద్యా నమూనాలను ప్రభుత్వాలు తీసుకుని పాఠ్యాంశాలుగా చేర్చగలిగితే బాగుందని ఆయన అభిప్రాయపడ్డారన్నారు. అనంతరం విజువల్‌ విద్యను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు దేవేంద్రాచారి కృషిని రామయ్య అభినందించి తనవంతుగా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 



Updated Date - 2020-12-19T03:11:27+05:30 IST