బస్టాండ్‌లో చోరీ
ABN , First Publish Date - 2020-12-02T03:57:11+05:30 IST
ఓ మహిళ నారాయణపేట బ స్టాండ్‌లో హైదరాబాద్ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్‌బాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు రూ.6వేల నగ దును అపహరించుకొని వెళ్లిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

మహిళ బస్సు ఎక్కుతుండగా ఘటన
8 4 తులాల బంగారు హారం, 16 మాసాల వస్తువుల
అపహరణ 8 రూ.6వేల నగదు సైతం..
నారాయణపేట క్రైం, డిసెంబరు 1 : ఓ మహిళ నారాయణపేట బ స్టాండ్‌లో హైదరాబాద్ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్‌బాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు రూ.6వేల నగ దును అపహరించుకొని వెళ్లిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామంలో మున్నూరు హైమావతి, మోహన్ భార్యాభర్తలు. హైమావతి తల్లిగారి ఊరు నారాయణ పేట మండలం అప్పిరెడ్డిపల్లి. వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గత నెల 27న హైమావతి సోదరి వివాహం ఉన్నందున పిల్లలతో కలిసి వచ్చింది. తిరిగి మంగళవారం హైదరా బాద్‌కు వెళ్లేందుకు తండ్రితో కలిసి పిల్లలను వెంటబెట్టుకొని నారాయణపేట బస్టాండ్‌కు వచ్చింది. అక్కడ హైదరాబాద్ బస్ ఎక్కుతుండగా ఆమె హ్యాండ్ బ్యాగులో ఉన్న 4తులాల బంగారు హారం, 16మాసాల ఇతర ఆభరణాలు, రూ.6వేల నగదు అపహకరణకు గురైంది. దీంతో వెంటనే పోలీసులకు సమా చారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకొని విచారణ ప్రారంభిం చారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏఎస్‌ఐ బాలయ్య తెలిపారు. బాఽధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
చిన్నచింతకుంట : మండల కేంద్రానికి చెందిన ఉప్పరి ఆంజి (26) అనే యువకుడు మంగళవారం తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలి పారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఆత్మహ త్యాయత్నానికి పాల్ప డినట్లు గ్రామస్థులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి
చిన్నచింతకుంట మండలంలోని తిర్మలాపూర్ గ్రా మానికి చెందిన ఆంజనేయులు(30) అనే వ్యక్తి బావి లో పడి మృతిచెందాడు. ఈనెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. మంగళవా రం మండలంలోని గూడురు శివారులోని పాడుబడ్డ బావిలో మృతదేహం గుర్తించిన మేకల కాపరి విష యం గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
30 టిప్పర్ల ఇసుక డంపు సీజ్
జడ్చర్ల : జడ్చర్ల, మహబూబ్‌నగర్ మధ్యదారిలోని ఓ ప్రాంతంలో 30 టిప్పర్‌ల ఇసుక డంపును మంగళవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. జడ్చర్ల హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో సుమారు 30 టిప్పర్‌ల ఇసుకను డంప్ చేసారన్న సమాచారం అందుకున్న మహబూబ్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణలు చేరుకుని విచారణ చేపట్టారు. డంపు చేసిన స్థలం ఎవరిది, అక్కడ ఇసుకును ఎందరు డంపు చేసారన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించినా, డంపు ఎవరిది అన్న విషయం తెలియలేదు. అధికారులు, ఇసుక డంపులను సీజ్ చేశారు. అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు అక్రమార్కులు ఇసుకను డంపు చేసారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డంపు చేసిందెవరనే అంశంపై పోలీసులతో విచారణ చేపట్టనున్నట్లు తహసీల్దార్ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
కారు, బైకు ఢీ - ఇద్దరికి గాయాలు
జడ్చర్ల, గంగాపురం మధ్యదారిలో బాదేపల్లి పత్తి మార్కెట్ సమీపంలో మంగళవారం కారు, డైకు ఢీకొన్నాయి. ఎదురెదురుగా వస్తున్న కారు, బైకు ఢీ కొన్న సంఘటనలో బైకుపై ఉన్న చెన్నయ్య, చెన్నమ్మలకు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
హన్వాడ : మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన యండీ అబ్దుల్ సుమీ ర్ (35) హన్వాడ పెద్ద చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలి పారు. నవంబరు 30న ఇంటి నుంచి హన్వాడకు అత్తగారి ఇంటికి వచ్చా డు. మంగళవారం చెరువులో శవమై కనిపించాడు.ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్త్తం చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
