బాల్య వివాహాలను అరికట్టాలి
ABN , First Publish Date - 2020-12-02T03:18:16+05:30 IST
ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి యాదమ్మ అన్నారు.

గోపాల్‌పేట, డిసెంబరు 1: ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి యాదమ్మ అన్నారు. మండలంలోని ఏదుట్ల గ్రామంలో మంగళవారం మహిళా ఆ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కమిటీ సమావేశం సర్పంచ్ శ్రీలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడంతో ఆడపిల్లలకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అంతేకాక గ్రామాభివృద్ధి మనందరి బాధ్యత అన్నారు. ప్రతీ గ్రామంలో కూడా బాలల సంరక్షణ కమిటీలు నియమించామన్నారు. బాలలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే బాలల సంరక్షణ కమిటీల దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరిస్తామని సూచించారు. అనంతరం బాలల హక్కుల సంరక్షణ కు సంబంధించిన పోస్టర్ల ఆమె విడుదల చేశారు. గ్రామ కార్యదర్శి సదాత్‌ఆలీ, ఏఎన్‌ఎంలు ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఉన్నారు.