-
-
Home » Telangana » Mahbubnagar » Chariot festival as Kanula festival
-
కనుల పండువగా రథోత్సవం
ABN , First Publish Date - 2020-12-29T04:02:22+05:30 IST
మండల పరిధిలోని మం థన్‌గోడ్ గ్రామ సమీపంలో వెలసిన దత్తేత్రేయ స్వామి ఆల యం వద్ద మంగళవారం రథోత్సవం కనుల పండువగా నిర్వ హించారు.

మక్తల్‌రూరల్, డిసెంబరు 28 : మండల పరిధిలోని మం థన్‌గోడ్ గ్రామ సమీపంలో వెలసిన దత్తేత్రేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, హోమం, పల్లకీ సేవ నిర్వ హించారు. మధ్యాహ్నం 12.30గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి డోలారోహణం చేసిన అనంతరం అన్నదానం చే శారు. సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథం ముం దుకు సాగింది. వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రా మాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.